Download App

Seven Review

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ నిజార్‌ షఫీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '7'. ఆరుగురుహీరోయిన్స్‌, హీరో హవీష్‌ మధ్య సాగే కథాంశం అనగానే అసలు హీరో.. ఆరుగురు అమ్మాయిలను ఏమైనా మోసం చేశాడా? ఏంటి? అనే సందిగ్ధత నెలకొంది. సినిమా ప్రమోషన్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి '7' ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంది. హీరో హవీష్‌కు ఎలాంటి సక్సెస్‌ను తెచ్చిపెట్టింది? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందు కథేంటో చూద్దాం.

కథ:

కార్తీక్‌(హవీష్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేస్తుంటాడు. బుద్ధిమంతుడైన కార్తీక్‌ తమను మోసం చేశాడంటూ రమ్య(నందితా శ్వేత), జెన్ని(అనీషా అంబ్రోస్‌) పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెడతారు. తర్వాత కేసును పరిశోధించే పోలీస్‌ ఆఫీసర్‌ వద్దకు మరో అమ్మాయి అదితి ఆర్య కూడా కార్తీక్‌ తనను మోసం చేశాడని కేసు పెడుతుంది. దాంతో సదరు పోలీస్‌ ఆఫీసర్‌ కార్తీక్‌ కోసం తెగ వెతుకుంటాడు. అయితే ఓ ముసలాయన మీరు వెతికేది కార్తీక్‌ని కాదు.. కృష్ణమూర్తి అనే తన స్నేహితుడ్ని అని చెబుతాడు. ఆ ముసలాడిని కూడా ఎవరో చంపేస్తారు? దాంతోపోలీసులకు ఏం చేయాలోతెలియక తలలు పట్టుకుంటారు. చివరకు పోలీసులు కార్తీక్‌ అరెస్ట్‌ చేస్తారు. అసలు తాను మోసం చేసినట్టు చెబుతున్న అమ్మాయిలెవరోతనకు తెలియదని కార్తీక్‌ చెబుతుంటాడు. అదే సమయంలో పోలీస్‌ కస్టడీలో ఉన్న కార్తీక్‌ను ప్రియ(త్రిదా చౌదరి) చంపడానికి ప్రయత్నిస్తుంది. తనను చంపడానికి ప్రయత్నించిన ప్రియే తన భార్య అని కార్తీక్‌ పోలీసులకు ఓట్విస్ట్‌ ఇస్తాడు. ఇంతకు ప్రియ, కార్తీక్‌ను ఎందుకు చంపాలనుకుంటుంది? కార్తీక్‌ ముగ్గురు అమ్మాయిలను నిజంగానే మోసం చేశాడా? వీరు కాకుండా కార్తీక్‌తో రిలేషన్‌ ఉండే సరస్వతి, భాను ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

సమీక్ష:

నటీనటుల విషయానికి వస్తే హీరో హవీష్‌ చక్కగా నటించాడు. ప్రెజెంట్‌ ట్రెండ్‌కు తగ్గ గెటప్‌తోనే కాదు.. ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే గెటప్‌లో బావున్నాడు. తన గత చిత్రాలతో పోల్చితే చక్కగా నటించాడు ఇక సినిమాలో రెజీనా పాత్ర సూపర్బ్‌. ఆమె తన నటనతో పాత్రను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఇక నందితా శ్వేత, త్రిదా చౌదరి, పూజితా పొన్నాడ, ఆదితి ఆర్య, సత్య, పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన రహమాన్‌ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. నిజార్‌ షఫీ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చక్కగా చేశాడు. దర్శకుడిగా తొలిసినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా మలచడంలో ఓకే అనిపించుకున్నా.. కథలోని మెయిన్‌ పాయింట్‌ను ఇంకా బాగా చెప్పి ఉండొచ్చు అనిపించింది. హీరోయిన్స్‌ హవీష్‌పై కంప్లైట్‌ ఇచ్చే యాంగిల్‌లో స్టోరినీ బిగిన్‌ చేయడం.. ఇతరుల పాయింట్‌ ఆఫ్‌ యాంగిల్‌లో ఆ ష్లాఫ్‌ బ్యాక్‌ను పూర్తి చేయడం బావుంది ఇక సినిమా చివరి వరకు సస్పెన్స్‌గానే సాగింది. ఇక ప్లాష్‌ బ్యాక్‌ కాన్సెప్ట్‌ బాగాఉంది. కథ, కథనాల విషయంలో ఇంకాస్త జాగత్త్రలు తీసుకుని ఉండాల్సింది. ఫస్టాఫ్‌లో సన్నివేశాలు డ్రాగింగ్‌గా అనిపిస్తాయి. సుంకర లక్ష్మి పాత్ర కథానుగుణంగానే ఉన్నా కూడా... ప్రేక్షకులకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం, బాగ్రౌండ్‌ స్కోర్‌సినిమాకు ప్లస్‌గా మారింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.

చివరగా.. 7.. మంచి కథాంశం బావున్నా కథ, కథనాల విషయంలో కేర్‌ తీసుకుని ఉండుంటే ఇంకా బావుండేది.

Read Seven Movie Review in English

Rating : 2.8 / 5.0