'2.0' తో షారూక్ సినిమాను చంపేస్తున్నారా?

  • IndiaGlitz, [Wednesday,November 28 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా న‌వంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది. అయితే ఇక్క‌డ ర‌జ‌నీకాంత్ సినిమా కార‌ణంగా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారూక్‌ఖాన్ సినిమాకు స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతుంది. అస‌లు స‌మ‌స్య ఏంటంటే.. ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో షారూక్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్క శ‌ర్మ హీరో హీరోయిన్స్‌గా రూపొందిన చిత్రం 'జీరో'.

ఇందులో షారూక్ మ‌రుగుజ్జు వ్య‌క్తిగా న‌టించాడు. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది. అయితే అదే రోజున క‌న్న‌డ స‌హా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న చిత్రం 'కె.జి.ఎఫ్‌'. య‌ష్ హీరోగా న‌టించిన ఈ చిత్ర హ‌క్కుల‌ను అనిల్ టాండ‌న్ సొంతం చేసుకున్నారు. దీనికి క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల‌కు త‌న వంతు స‌హాయం చేస్తున్నాడు.

అయితే షారూక్ సినిమా అంటే భారీ విడుద‌ల ఉంటుంది. కాబ‌ట్టి 50 శాతం థియేట‌ర్స్‌ను కె.జి.ఎఫ్‌కు కేటాయించాల‌ని క‌ర‌ణ్‌జోహార్‌, అనిల్ టాండ‌న్ కండీష‌న్స్ పెడుతున్నార‌ట‌. అలా అయితేనే '2.0'ని స‌ద‌రు థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శింప చేయ‌డానికి అనుమ‌తిస్తామ‌నేది కండీష‌న్‌గా ఉంది. మ‌రి షారూక్ త‌న సినిమా భారీ విడుద‌ల కోసం ఏం చేయ‌బోతున్నాడో చూడాల్సిందే.

More News

5రోజులు.. 4 కోట్లు

అమెరికా సింగ‌ర్ నిక్ జోన‌స్‌, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాల వివాహం డిసెంబ‌ర్ 2, 3 తేదీల్లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. పెళ్లికి ముందు తంతు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతుంది.

మంత్రిని ప్ర‌శ్నించిన మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మంత్రి కేటీఆర్‌ను ఓ విష‌యంలో సోషల్ మీడియా ద్వారా ప్ర‌శ్నించారు. వివ‌రాల్లోకెళ్తే.. నాగ్ అశ్విన్ స్నేహితుడు కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు.

'క‌వ‌చం' వాయిదా

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా  న‌టిస్తోన్న చిత్రం 'క‌వచం'.  బెల్లంకొండ శ్రీనివాస్  ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు.

అసత్య ఆరోప‌ణ‌లు ఆప‌మంటున్నహీరోయిన్‌

త‌మిళ న‌టి గాయ‌త్రి ర‌ఘురాం త‌ప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ ఆడ‌యార్‌లో పోలీసుల‌కు చిక్కింది. పోలీసుల‌తో వాగ్వాదం చేసింది.

చివ‌రి షెడ్యూల్‌లో 'య‌న్‌.టి.ఆర్‌'

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'