close
Choose your channels

రీషూట్ నిజ‌మేగా!

Sunday, September 2, 2018 • తెలుగు Comments

రీషూట్ నిజ‌మేగా!

ఓ మోస్త‌రు హీరోలు కాకుండా కాస్త స్టార్ హీరోల రేంజ్‌కు వెళితే మారుతికి క‌ష్ట‌మైపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వెంక‌టేశ్‌తో మారుతి చేసిన బాబు బంగారం  సినిమా కూడా అనుకున్న స్థాయి స‌క్సెస్‌ను సొంతం చేసుకోలేదు.

తాజాగా ఇప్పుడు నాగ‌చైత‌న్య సినిమా శైలజారెడ్డి అల్లుడు సినిమాను డైరెక్ట్ చేస్తున్న మారుతి సినిమాను ముందుగా ఆగ‌స్ట్ 31కే రిలీజ్ చేస్తామ‌నుకున్నారు. కానీ అవుట్ పుట్ విష‌యంలో నాగ్ ఎందుకో శాటిస్‌ఫై కాలేదు. చాలా వ‌ర‌కు చేంజ‌స్ చెప్పాడు. అందుక‌నే సినిమాను రీ షూట్ చేస్తున్నారు.

ఏదో చిన్న చిన్న రీ షూట్స్ అంటున్నారు కానీ.. లోప‌ల మాత్రం ప‌దిరోజులు పైగా రీషూట్స్ అంటే చిన్న విష‌యం కాదుగా..!. ప్ర‌స్తుతం కాచారంలో పొలాల మ‌ధ్య‌లో షూటింగ్ జ‌రుగుతుంది. సినిమాను సెప్టెంబర్ 13న విడుద‌ల చేయ‌బోతున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య‌, అను ఇమ్య‌మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz