close
Choose your channels

సెన్సార్‌ బోర్డుకే వార్నింగ్ ఇచ్చిన షకీల!

Wednesday, December 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సెన్సార్‌ బోర్డుకే వార్నింగ్ ఇచ్చిన షకీల!

అవును ఇదేదో రీల్ లైఫ్‌లో అనుకునేరు.. కాదండోయ్.. రియల్ లైఫ్‌లో అదీ కూడా సినిమాలకు సర్టిఫికెట్స్ ఇచ్చే సెన్సార్ బోర్డుకు సీనియర్ నటి షకీల వార్నింగ్ ఇచ్చింది. అసలు ఆమె ఎందుకు వార్నింగ్ ఇచ్చింది..? వార్నింగ్ ఇచ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఏ విషయంలో వార్నింగ్ ఇచ్చింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. షకీల ప్రధాన పాత్రలో చేస్తూ.. నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌కుగాను బోర్డును కోరగా రెండుసార్లు సర్టిఫికెట్ ఇచ్చేందుకు కుదరదని తేల్చిచెప్పేసింది. అయితే అస్తమానూ ఇలాంటి పరిస్థితి వస్తుండటంతో బుధవారం నాడు చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆమె సెన్సార్ బోర్డుపై దుమ్మెత్తిపోశారు. అంతేకాదు.. ఒకింత వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆమె మాట్లాడింది.

అసలేంటి కథ!
సెన్సార్ బోర్డుకు సంబంధించిన కొందరు సభ్యులు తనను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్‌కి అయినంత ఖర్చు సెన్సార్ ఇచ్చామని ఆమె తెలిపింది. అస‌లు త‌ప్పు ఎక్కడ జ‌రుగుతుందో తనకు తెలుసని దానికి సంబంధించిన అన్ని రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని.. ఇక ఆడుకుంది చాలు తాను మీ మంచి కోసమే చెబుతున్నానని సెన్సార్ బోర్డు సభ్యులకు షకీలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

మేం బతుకొద్దా!?
వాస్తవానికి ఈమె సినిమాలో నటించడమే కాకుండా నిర్మిస్తున్నారు కూడా. అయితే సెన్సార్ బోర్డు మాత్రం ఇప్పటికీ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు.. అంతేకాదు ఈమె ఇచ్చుకోవాల్సింది ఇచ్చేసింది.. సభ్యులు కూడా పుచ్చుకోవాల్సింది పుచ్చుకున్నారని షకీల మీడియా ముందు చెబుతోంది. అయినప్పటికీ సెన్సార్ ఎందుకు చేయట్లేదే అర్థం కావట్లేదని.. మూవీ కోసం తామెంతో కష్టపడ్డామని.. ఇలాంటి చిత్రాలకు ఇదివరకే సర్టిఫికెట్స్ ఇచ్చి ‘లేడీస్ నాట్ అలౌడ్’కు మాత్రం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. అయితే ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదని.. ఇలా జరగడానికి కారణమెవరు..? చిన్న చిన్న నిర్మాతలు బతకకూడదా..? మేం మనుషులం కాదా..? అని ఆమె బోర్డును ప్రశ్నించింది. అయితే ముందుగానే ఈ చిత్రం అడల్ట్ కామెడీ సినిమా అని చెప్పిన విషయాన్ని మరోసారి ఆమె గుర్తు చేసింది. అయితే ఈమె వ్యాఖ్యలపై సెన్సార్ బోర్డు సభ్యలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.