పెద్ద బ్యానర్లో అర్జున్ రెడ్డి భామ

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే కొత్త‌గా తెలుగులో ఓ సినిమాకు సంత‌కం చేశార‌ని వినికిడి. అందులో ఆమె అడ్వ‌కేట్ పాత్ర పోషించ‌నున్నారు. ఈ సినిమాను స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ మీద స్వ‌ప్న‌ద‌త్ నిర్మించ‌నున్నారు. ఆల్రెడీ వ‌రుస హిట్ల‌తో స్వ‌ప్న జోరుమీదున్నారు. అందుకే న్యూ ఏజ్ మూవీని తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే అనుదీప్ చెప్పిన క‌థ న‌చ్చింద‌ట‌. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, న‌వీన్ పొలిశెట్టిల‌ను హీరోలుగా ఎంపిక చేసుకున్నారు.

నాయిక‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర కావ‌డంతో కాస్త పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌, ప్ల‌స్ గ్లామ‌ర‌స్ యాక్ట్రెస్ కోసం చూశారు. షాలినీ పాండే అయితే అన్ని విధాలుగా బావుంటుంద‌ని ఆమెను ఎంపిక చేసుకున్నారని స‌మాచారం. త్వ‌ర‌లోనే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసి, సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌నున్నారట‌. అయితే, 'పిట్ట‌గోడ‌' చిత్రం అనుదీప్‌కి పెద్ద‌గా హిట్ కాలేదు. మ‌రి ఈ సినిమాను ఎలా ప్లాన్ చేస్తున్నాడో, స్వ‌ప్న‌ద‌త్‌కు ఏం చెప్పి ఒప్పించాడో చూడాలి.

More News

'సుప్రీమ్‌' కాంబో తో మారుతి

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించ‌బోయే సినిమా కోసం రోజుకొక పేరు వినిపిస్తోంది.

కేసీఆర్‌ను క‌లిసిన శంక‌ర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ క‌లిశారు. ముఖ్య‌మంత్రిని శాలువాతో స‌త్క‌రించారు.

కాళేశ్వరంకు జగన్ రాక సరే.. కట్టప్ప సంగతేంటి!?

టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. టీఆర్ఎస్ సర్కార్ అనడం కంటే.. నాటి మంత్రి తన్నీరు హరీష్ రావు మనసుపెట్టి నిద్రాహారాలు మాని అహర్నిశలు కష్టపడి..

చార్లీచాప్లిన్‌గా మారిన శివాజీ

ఇదేంటి.. గరుడుపురాణం శివాజీ.. చార్లీచాప్లిన్‌లా మారడమేంటి..? తూచ్.. ఆయనకు ఏం అవసరం..?

మంత్రి వార్నింగ్.. గంటల్లోనే టీటీడీ చైర్మన్ రాజీనామా!

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే.