పెద్ద బ్యానర్లో అర్జున్ రెడ్డి భామ
Send us your feedback to audioarticles@vaarta.com
అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే కొత్తగా తెలుగులో ఓ సినిమాకు సంతకం చేశారని వినికిడి. అందులో ఆమె అడ్వకేట్ పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్ మీద స్వప్నదత్ నిర్మించనున్నారు. ఆల్రెడీ వరుస హిట్లతో స్వప్న జోరుమీదున్నారు. అందుకే న్యూ ఏజ్ మూవీని తెరకెక్కించాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టే అనుదీప్ చెప్పిన కథ నచ్చిందట. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నవీన్ పొలిశెట్టిలను హీరోలుగా ఎంపిక చేసుకున్నారు.
నాయికకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో కాస్త పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ప్లస్ గ్లామరస్ యాక్ట్రెస్ కోసం చూశారు. షాలినీ పాండే అయితే అన్ని విధాలుగా బావుంటుందని ఆమెను ఎంపిక చేసుకున్నారని సమాచారం. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. అయితే, `పిట్టగోడ` చిత్రం అనుదీప్‌కి పెద్దగా హిట్ కాలేదు. మరి ఈ సినిమాను ఎలా ప్లాన్ చేస్తున్నాడో, స్వప్నదత్‌కు ఏం చెప్పి ఒప్పించాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.