షాలిని టీజర్, లోగో లాంచ్

  • IndiaGlitz, [Saturday,March 11 2017]

స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లయన్ సాయి వెంకట్ సమర్పణలో వస్తున్న మరో హర్రర్ థ్రిల్లర్ "షాలిని". ఈ సినిమాకి సంబధించి లోగోను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ లాంచ్ చేయగా టీజర్స్ ను సెన్సార్ బోర్డు సభ్యుడు రామకృష్ణ, నాగబాల సురేష్ కుమార్లు రిలీజ్ చేశారు. సినిమా పోస్టర్ ను లయన్ సాయి వెంకట్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లయన్ సాయి వెంకట్ మాట్లడుతూ.. "త్వరలో రానున్న మా "పిశాచి-2" సినిమా పబ్లిసిటీలో బిజీగా ఉండగా ఈ సినిమా దర్శకుడు షెరాజ్ నన్ను కలిసి మా "షాలిని" సినిమా కూడా మీ సహకారం కావాలని అడిగాడు. సినిమా చూసి షెరాజ్ చాలా బాగా తీసాడనిపించింది. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధమవుతుంది. ఇదో మంచి హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా రిలీజ్ తరువాత షెరాజ్ తో కరెప్షన్ మీద భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్నాను" అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "హారర్ సినిమాలను ఆదరిస్తున్న ఈ రోజుల్లో "షాలిని" కూడా మంచి హిట్ సాధిస్తుంది. చిన్న సినిమాగా వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది" అన్నారు.
చిత్ర నిర్మాత పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. "నాకు కృష్ణ గారంటే చాలా అభిమానం. ఆయన స్ఫూర్తితోనే నిర్మాతగా మారాను. మాకు అన్ని విధాలా సహకరిస్తున్న సాయి వెంకట్ గారికి కృతఙ్ఞతలు" అన్నారు.
దర్శకుడు షెరాజ్ మాట్లడుతూ.. "దెయ్యానికి ఒక రూపం ఉండదని చెప్పే చిత్రమే మా "షాలిని". చిన్న సినిమాలకు పడే కష్టం పెద్ద సినిమాలకు ఉండదు. కష్టపడి ఈ సినిమాను తీసాం. తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో అమోఘ్ దేశపతి, హీరోయిన్ అర్చన, లిరిక్ రైటర్ భాష్యశ్రీ, సంగీత దర్శకుడు నవనీత్ చర్య, జె. వి.మోహన్ గౌడ్, పున్నం సత్యనారాయణ, అనిల్ సింగ్, మురళి కృష్ణ, కెమెరామెన్ సుమన్ శ్రీరామోజు తదితరులు పాల్గొన్నారు.

More News

బరువు తగ్గుతున్న యంగ్ టైగర్

యంగ్టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. జనతాగ్యారేజ్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్..ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై `జై లవకుశ` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ సినిమా టైటిల్ తో నితిన్

నితిన్ హీరోగా త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై దర్శకుడు త్రివిక్రమ్, పవర్స్టార్ పవన్కళ్యాణ్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

రెండేళ్లు సరైన హిట్ లేదు : సందీప్ కిషన్

నగరం సినిమాతో హిట్ కొట్టిన సందీప్కిషన్ ఆనందాని అవధులు లేకుండా పోయాయి. తెలుగు, తమిళంలో మార్చి 10న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

'బాహుబలి-2' ట్రైలర్ రిలీజ్ డేట్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న విజువల్ వండర్ బాహుబలి కన్ క్లూజన్ సినిమా కోసం తెలుగు సినీ పరిశ్రమే యావత్ భారత సినిమా రంగం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఏ.వి.ఎం. మేకర్స్'బిచ్చగాడా..మజాకా'

ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో.. "ఆల్ వెరైటీ మూవీ మేకర్స్" పతాకంపై నూతన నిర్మాత బి.చంద్రశేఖర్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం "బిచ్చగాడా మజాకా.