'శమంతకమణి' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Thursday,June 15 2017]

నారా రోహిత్‌, సందీప్ కిష‌న్‌, సుధీర్ బాబు, ఆది సాయికుమార్‌, డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఇంద్ర‌జ కీల‌క‌పాత్ర‌ల్లో భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం 'శ‌మంత‌క‌మ‌ణి'. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వి. ఆనంద‌ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

డిఫ‌రెంట్ చిత్ర‌మిది. నా క్యార‌క్ట‌ర్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. కొత్తగా ఉంటుంది. నా క్యార‌క్ట‌ర్ బాగా న‌చ్చ‌డంతోనే సినిమా చేశాను. 'బాణం', 'సోలో' త‌ర్వాత మ‌ణిశ‌ర్మ సంగీతంలో చేస్తున్నాను. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. న‌లుగురు హీరోల‌ను ఒక తాటి మీద‌కు తీసుకొచ్చిన ఆనంద‌ప్ర‌సాద్‌గారికి అభినంద‌నలు అని నారా రోహిత్ చెప్పారు.ఇందులో ప్ర‌తి పాత్ర బావుంది. అందుకే నాకు ఏ పాత్ర సూట్ అయితే దాన్నే ఇవ్వ‌మ‌ని ఆప్ష‌న్ ద‌ర్శ‌కుడికి ఇచ్చాను. ఇది రెగ్యుల‌ర్ ఫార్ములాలో ఉండ‌దు. చాలా కొత్త‌గా ఉండే స్క్రిప్ట్. నేను ఇందులో త‌ల్లిని కోల్పోయిన వ్య‌క్తిగా న‌టిస్తున్నాను. ఎమోష‌న్ ఫ్యాక్ట‌ర్ ఉన్న క్యార‌క్ట‌ర్ నాది. న‌లుగురు హీరోల‌తో సినిమా చేయ‌డ‌మంటే ఇబ్బందే అని అనుకుంటున్న ఈ త‌రుణంలో దాన్ని సుసాధ్యం చేసిన ఘ‌న‌త ఈ టీమ్‌ది అని సుధీర్‌బాబు తెలిపారు.

సినిమా మొన్న‌నే స్టార్ట్ అయ్యింది. అప్పుడే అయిపోవ‌స్తుంది. మంచి టీం కుదిరింది. మోష‌న్ పోస్ట‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది. మ‌ణిగారి సంగీతంలో నేను న‌టిస్తున్న రెండో చిత్ర‌మిది. కార్తిక్ అనే ల‌వ‌బుల్ పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని హీరో ఆది అన్నారు. టీజ‌ర్‌ని గెస్ చేయ‌మ‌ని ఓ కాంటెస్ట్ ని ర‌న్ చేశాం. త్వ‌ర‌లో మా న‌లుగురు హీరోల‌ను ఒక‌చోట క‌లిపి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా న‌లుగురిని ఎంపిక చేసి వారికి చెప్పిన‌ట్టే ఐ7 ఫోన్ల‌ను ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో అందిస్తాం. ఈ సినిమా చేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు శ్రీరామ్ ఆదిత్య చాలా మంచి క‌థ చెప్పారు. అంద‌రూ చ‌క్కగా న‌టించారు. జులై 14న చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత వి.ఆనంద్ ప్ర‌సాద్ చెప్పారు.

నేను తొలిసారి రాసుకున్న క‌థ ఇది. న‌లుగురు హీరోలూ నాకు చాలా స‌పోర్ట్ చేశారు. ఒక్కొక్క‌రితోనూ నాకు మంచి అనుభ‌వం ఉంది. షూటింగ్ ఫాస్ట్ గా చేయ‌డానికి స‌మీర్ రెడ్డి కెమెరాప‌నిత‌నం కూడా తోడైంది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, సుమ‌న్‌గారు, త‌నికెళ్ల‌భ‌ర‌ణిగారు, మ‌ణిశ‌ర్మ‌గారు.. లాంటి సీనియ‌ర్ల‌తో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌వీణ్‌పూడి ఎడిటింగ్ చేస్తున్నారు. ఆనంద్‌ప్ర‌సాద్‌గారు చాలా పాజిటివ్‌గా ఉండే నిర్మాత‌. అని ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పారు.

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఆదిత్య .టి., నిర్మాత‌: వి. ఆనంద‌ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: అన్నే ర‌వి, కెమెరా: స‌మీర్ రెడ్డి, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, మాట‌లు: వెంక‌ట్ డి పాటి, అర్జున్ - కార్తిక్‌, శ్రీరామ్ ఆర్‌. ఎర‌గం, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్: వివేక్ అన్నామ‌లై, నృత్యాలు: ర‌ఘు.

More News

'విఠలాచార్య' షురూ..

విఠలాచార్య చాలా గొప్పదర్శకులు.ఆయన పేరుతో సినిమా స్టార్ట్ చేయడం బావుంది.

కోలీవుడ్ లో రాజశేఖర్ కుమార్తె...

రాజశేఖర్ దంపతుల మొదటి కుమార్తె శివాని త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయనుందనే వార్తలు వస్తున్నాయి. శివాని ప్రస్తుతం ఎం.బి.బి.ఎస్ మూడో ఏడాది చదువుతుంది. త్వరలోనే తెరంగేట్రం చేయనున్న శివాని తెలుగులో తేజ దర్శకత్వంలో నటిస్తుందని అన్నారు.

ఎన్టీఆర్ సాంగ్ రీమిక్స్ చేస్తున్న బాలయ్య..

స్టార్ హీరోల సాంగ్స్ ను వారి వారసులు రీమిక్స్ చేయడం సర్వసాధారణ విషయమైంది.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఎప్పుడంటే...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం జై లవకుశ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న '3ల్'

సుక్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఫాదర్ అండ్ మదర్ సమర్పణలో సంజీవ్కుమార్ హీరోగా సురేష్ సబ్నే దర్శకత్వంలో నిర్మాత సంజీవ్కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'థ్రిల్'. పవిత్ర, సోనాలి హీరోయిన్స్. సుమన్ శెట్టి, రేలంగి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలు పోషించారు. ఇదొక సస్పెన్స్తో కూడుకున్న అద్భుతమైన ప్రేమకథా చిత్రం.