close
Choose your channels

సిగ్గో సిగ్గు.. బాలు అంత్యక్రియలకు మొహం చాటేసిన టాలీవుడ్!

Sunday, September 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సిగ్గో సిగ్గు.. బాలు అంత్యక్రియలకు మొహం చాటేసిన టాలీవుడ్!

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం పరమపదించారు. బాలు అంత్యక్రియలు చెన్నై శివారులోని ఫామ్ ‌హౌస్‌లో జరిగిన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక ఖననం చేశారు. ఏపీ ప్రభుత్వ తరపున మంత్రి అనిల్ యాదవ్ హాజరై నివాళులు అర్పించారు. సినీ రంగం నుంచి విజయ్, భారతీరాజా, దేవీశ్రీప్రసాద్, మనో తదితరులు హాజరయ్యారు.

బాలు పరమపదించిన విషయం తెలుసుకుని పలువురు మహానటులు చేసిన వ్యాఖ్యలు.. ‘‘బాలు మరణ వార్త విని గుండె పగిలింది.. ప్రతి క్షణం ఆయనను తలుచుకుంటూనే ఉంటా.. నా హృదయంలో బాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు.. నా సరస్వం లేదని నమ్మలేకపోతున్నా..’’ అంటూ ఎన్నెన్నో ట్వీట్లు.. సోషల్ మీడియా వేదికగా ప్రసంగాలు.. బాలు కాళ్లపై పడిన ఫోటోలు షేర్ చేస్తూ కన్నీళ్లు.. ఒకటేమిటి? సినిమా భాషలో చెప్పాలంటే.. రెండు రోజుల్లో భారీ బడ్జెట్ సినిమానే చూపించారు. కానీ అంత్యక్రియలకు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరవలేదు ఎంత సిగ్గుచేటు.. కడసారి చూసేందుకు ఒక్క తెలుగోడూ వెళ్లలేదు.

నెగిటివ్ వచ్చి చాలా రోజులవుతోందిగా..

మరి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలు అంత్యక్రియలకు ఒక్కరైనా హాజరయ్యారా? మరణించిందేమైనా సామాన్యుడా? మహా శిఖరం నేలకొరిగింది. నాలుగు దశాబ్దాల పాటు తన గానామృతంతో ప్రపంచాన్ని ఓలలాడించిన మహోన్నత వ్యక్తి మరణిస్తే సోషల్ మీడియాకే పరిమితమై కన్నీళ్లు పెట్టిన వారినేమనాలని నెటిజన్లు మండిపడుతున్నారు. బాలు మరణాన్ని కరోనా లిస్టులో వేస్తారా? మరి ఆయనకు నెగిటివ్ వచ్చి చాలా కాలం అవుతోందిగా.. ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకున్న కొన్ని వేల మంది అభిమానులకు ఆ విషయం తెలియకుండా పోయిందా? పోనీ వెళ్లలేనంత దూరమూ కాదుగా.. అయినా సరే ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. ఇది నిజంగా టాలీవుడ్‌కే సిగ్గు చేటంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

పాడె మోయకపోయినా పర్వాలేదు..

తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఒక పాటను పాడారు. అలాంటి వ్యక్తి మరణిస్తే.. పాడె మోయకపోయినా పర్లేదు కానీ.. కనీసం కడసారి అయినా చూడటానికి వెళ్లాలి కదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు మండి పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మాత్రం.. బాలు.. అంతటి వాడు.. ఇంతటి వాడంటూ ఉపన్యాసాలిచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప చేసిందేం లేదు. ఏదో ఒక సినిమాలో బాలు ఆయనకు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆ మమకారంతో హీరో విజయ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ మన వాళ్లేం చేసారు? ఎందుకిలా? ఒక మహోన్నత శిఖరం నేలకొరిగితే.. సోషల్ మీడియాకు పరిమితమవుతారా?

బాలు జీవించి ఉన్నప్పుడూ.. ఇంతే..

బాలు పరమపదించాక విషయం పక్కనబెడితే జీవించి ఉన్నప్పుడూ మన టాలీవుడ్ పెద్దలు ఆయనకు పెద్దగా మర్యాద ఇచ్చిందేం లేదు. ఒక షోలో బాలు చెప్పిన విషయమే దీనికి నిదర్శనం. ఒకానొక సందర్భంలో తన ఇంట్లో ఏదో కార్యక్రమం ఉంటే బాలు ఇండస్ట్రీలో అందర్నీ పిలిచారంట.. ఒక్క వెంకటేష్ మినహా మిగిలిన వారెవ్వరూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదట. ఇలాంటి సందర్భంలోనే ఇంతటి మహానుభావులు తెలుగు వారవడం వారి ఖర్మేమో అనిపిస్తుంది. అదే ఏ తమిళనాడులోనే పుట్టి ఉంటే ఆ మహా శిఖరం అంత్యక్రియలకు కోలీవుడ్ మొత్తం హాజరై ఉండేది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.