షామిలీ రీ ఎంట్రీ..?

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

బేబి షామిలీగా చిన్న‌ప్పుడు బాగా పాపుల‌ర్ అయిన షామిలీ ఓయ్ చిత్రంతో తెలుగు తెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌యమైంది. అయితే ఓయ్ సినిమా ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌లేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న షామిలీ మ‌ళ్లీ న‌టించేందుకు రెడీ అయ్యింది. నారా రోహిత్ స‌ర‌స‌న న‌టించేందుకు ఓకె చెప్పింద‌ట‌. క‌థ‌లో రాజ‌కుమారి అనే వెరైటీ టైటిల్ తో రూపొందే ఈ సినిమాని మ‌హేష్ సుర‌ప‌నేని తెర‌కెక్కిస్తున్నారు.

కార్తీకేయ చిత్ర నిర్మాత శ్రీనివాస్ బొగ్గ‌రం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈసారి షామిలీ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ తో ఆక‌ట్టుకోవ‌డానికి వ‌స్తుంద‌ట‌. డిసెంబ‌ర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించి స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..ఓయ్ చిత్రంతో ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయిన షామిలీ రాజ‌కుమారిగా ఆక‌ట్టుకుంటుంద‌ని ఆశిద్దాం.

More News

బ‌న్ని ఈ సారైనా క‌చ్చితంగా వ‌స్తాడా?

క‌థానాయ‌కుడు పాత్ర‌ల్లో న‌టించిన రేసు గుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల‌తో 50 కోట్ల క్ల‌బ్‌లోకి చేరాడు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఈ కేట‌గిరిలో హ్యాట్రిక్ కొట్ట‌డానికి సిన్సియ‌ర్‌గా ట్రై చేస్తున్నాడు బ‌న్ని.

న‌య‌న‌'తార(క‌) మంత్రం'

తెలుగులో న‌య‌న‌తార జోష్ ఈ మ‌ధ్య‌కాలంలో బాగా త‌గ్గింద‌నే చెప్పాలి. అయితే త‌మిళంలో మాత్రం ఆమె హ‌వా మాములుగా లేదు.

జపం..జ‌పం..ప‌వ‌న్ జపం

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుని జ‌పం చేస్తున్న‌ట్లుగా క‌ల‌వరించే సెలబ్రిటీల‌కి టాలీవుడ్‌లో కొద‌వే లేదు. ఈ లిస్ట్‌లోకి ఫ్రెష్‌గా చేరిన పేరు రాయ్ ల‌క్ష్మీది.

ఇది త‌మ‌న్ దండ‌యాత్ర‌

తెలుగునాట జోష్‌ఫుల్‌గా కెరీర్ ని కొన‌సాగిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో త‌మ‌న్ ఒక‌రు. ఓ వైపు అగ్ర క‌థానాయ‌కుల సినిమాల కోసం ప‌నిచేస్తూనే.

అప్పుడు ఐటం గ‌ర్ల్‌.. ఇప్పుడు హీరోయిన్‌

మెగాస్టార్ చిరంజీవి ఆరేళ్ల విరామం త‌రువాత వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న చిత్రం బ్రూస్ లీ. రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో చిరు గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇవ్వ‌నున్నారు.