జర్నలిస్ట్ ల పై '2.0' టీం దాడి...శంకర్ క్షమాపణ

  • IndiaGlitz, [Wednesday,March 22 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జీనీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రోబో సీక్వెల్ 2.0 ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలను కూడా జ‌రుపుకుంటున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్‌పై శుభ‌క‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఎమీజాక్స‌న్ కూడా న‌టించింది. ప్యాచ్ వ‌ర్క్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో కొంత మంది ఫోటో జ‌ర్న‌లిస్టులపై 2.0 యూనిట్‌కు చెందిన బౌనర్స్ దాడి చేశార‌ట‌. ఈ కేసు పోలీసుల వ‌ర‌కు వెళ్ళింద‌ట‌. అయితే డైరెక్ట‌ర్ శంక‌ర్ సీన్‌లోకి ఎంట‌రై..ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ను నిర్వ‌హించి..ఏదో తెలియ‌కుండా జ‌రిగిన త‌ప్ప‌ని, భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు రిపీట్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని మీడియాకు క్ష‌మాప‌ణ చెప్పాడు.

More News

సల్మాన్ తో నాని విలన్...

బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఏక్థా టైగర్ సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.కబీర్ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించారు.

తెలుగులో విడుదల కానున్న రెహమాన 'ఒరు ముగత్తిరై'

తమిళ నటుడు రెహమాన తెలుగువారికి బాగా సుపరిచితుడే. ఆయన నటించిన ‘16 - ఎవ్రీ డీటైల్ కౌంట్స్’ ఇటీవల తెలుగులో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది.

'రోగ్' రిలీజ్ డేట్

ఇషాన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ `రోగ్`. ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కానుంది. ఇషాన్ హీరోగా మన్నారాచోప్రా, ఏంజెలినా హీరోయిన్స్గా జయాదిత్య సమర్పణలో తాన్వి ఫిలింస్ పతాకంపై డా. సి.ఆర్. మనోహర్, సి.ఆర్. గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఉగాదికి నాగ చైతన్య ఫస్ట్ లుక్

ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా సినిమా రూపొందుతోంది. ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి రా రండోయ్..వేడుక చూద్దాం` అనే టైటిల్ను రిజిష్టర్ చేశారట.

'సరయు' సినిమా ఫస్ట్ లుక్ లాంచ్

భగీరథ్ పరశురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బలరామనాయుడు కర్రీ సమర్పణలో,భగీరథ్ పరశురామనాయుడు మరియు రమాదేవి కర్రీ నిర్మాతలుగా తెరకెక్కిన సినిమా "సరయు" అన్ని ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు సిద్దమయింది.