ఫోర్ డీ.. అంటే ఏంటంటే?.. శంక‌ర్ వివ‌ర‌ణ‌

  • IndiaGlitz, [Saturday,November 03 2018]

'2.0' టీజ‌ర్‌ను శ‌నివారం 4డీలో విడుద‌ల చేశారు. 4డీ గురించి ద‌ర్శ‌కుడు శంక‌ర్ మాట్లాడుతూ ''ఈ సినిమా క‌థ‌ను రాసేట‌ప్పుడు ఎలాగైనా ఇది త్రీడీలో వ‌స్తేనే బావుంటుంద‌ని అనుకున్నా. సౌండ్ మాత్రం 4 డీలో ఉండాల‌ని అనుకున్నా. నా ఎన్నో ఏళ్ల క‌ల అది. మామూలుగా మ‌నం సినిమా చూసేట‌ప్పుడు చుట్టుప‌క్క‌ల నుంచి, పై నుంచి స్పీక‌ర్ల ద్వారా శ‌బ్దాల‌ను వినొచ్చు. కానీ కాళ్ల కింద కూడా స్పీక‌ర్లు ఉంటే... నేల మీద జ‌రిగే అంశాల‌కు కూడా సౌండ్ క‌ల్పిస్తే బావుంటుంద‌ని ఆశించాను. ర‌సూల్ పూకుట్టి కూడా దానికి ఎంత‌గానో స‌హ‌క‌రించారు. కేవ‌లం 4డీ సౌండ్ ని అందించ‌డం మాత్ర‌మే కాదు.. 4,5 స్టూడియోలో ఉన్న అన్నీ సిస్ట‌మ్స్ ని ఆయ‌న స్టూడియోకి తెచ్చారు.

ఈ సినిమా చూసిన త‌ర్వాత మేం ప‌డ్డ క‌ష్టం అర్థ‌మవుతుంది. ఎగ్జిబిట‌ర్ల‌కు నేను రిక్వ‌స్ట్ చేసేది ఒక్క‌టే.. ద‌య‌చేసి త్రీడీ థియేట‌ర్ల‌ను ఎక్కువ చేయండి. ఈ సినిమా ఫుల్ ఎఫెక్ట్ తెలియాలంటే 4డీ సౌండ్ సిస్ట‌మ్‌లోనూ, త్రీడీలోనూ చూస్తేనే అందుతుంది'' అని అన్నారు. జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్ వ‌చ్చిన 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్, క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో సుభాష్ క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌.

More News

'2.0' గురించి రెహ‌మాన్ స్పీచ్‌!

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా '2.0'. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌లో సంగీత ద‌ర్శ‌కుడు రెహ‌మాన్ మాట్లాడారు.

వీ1.. వీ 786!

వీ ఏంటీ 1 ఏంటి?  మ‌ళ్లీ వీ ఏంటి? 786 ఏంటి? అస‌లు ఆ హెడ్డింగ్ ఏంటి? ఏం చెప్పాల‌నుకున్నారు? అనేగా మీ అనుమానాలు..

'మంచు కురిసె వేళలో' ఫస్ట్ లుక్ విడుదల

రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలొ ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం "మంచు కురిసె వేళలో".

ఈసారి మరింత యూత్‌గా..!

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రాల‌కు, ఆయ‌న క‌థ‌లందించే సినిమాల‌కు తేడా స్ప‌ష్టంగా ఉంటుంది.

ఏం నానీ...వ‌ర్క‌వుట్ అయిన‌ట్టేనా?

'కొత్త‌బంగారులోకం', 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు', 'ముకుంద‌', 'బ్ర‌హ్మోత్స‌వం'... ఈ సినిమాల పేర్లు చెబితే శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పిన‌ట్టే.