తండ్రి సెంటిమెంటే ఆయుధంగా ముందుకు సాగుతున్న షర్మిల..

  • IndiaGlitz, [Monday,February 15 2021]

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల తెలంగాణ పాలిటిక్స్‌లో మరింత యాక్టివ్ అవుతున్నారు. తండ్రి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను తన రాజకీయ అడుగులకు ఆలంబనగా చేసుకుని సాగుతున్నారు. తండ్రి వివాహ తేదీనాడు తన రాజకీయ ఆరంగేట్రానికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం షర్మిల తన పార్టీ ఆవిష్కరణకు రెండు తేదీలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మే 14 లేదా జూలై 8న షర్మిల పార్టీ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ రెండు తేదీల్లో మే 14న ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాగా.. జులై 8 వైఎస్సార్ జయంతి కావడం విశేషం.

తొలిరోజు నుంచి తండ్రికి సంబంధించిన ముఖ్యమైన తేదీలనే సెంటిమెంటుగా చేసుకుని షర్మిల నడుస్తున్నారు కాబట్టి ఈ రెండు తేదీల్లోనే పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం ఉండవచ్చని తెలుస్తోంది. అయితే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తే.. ఆ తరువాత పాదయాత్రలకు వెళ్లొచ్చని ముఖ్యనేతలు ఆమెకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. జూలై 8న వైఎస్సార్ జయంతిని షర్మిల సెంటిమెంట్‌గా భావిస్తున్నారు.అయితే ఈ తేదీ మరింత ఆలస్యం అవుతుందని ముఖ్య నేతలు ఆమెకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ రెండు తేదీల్లో షర్మిల మొదటి తేదీనే ఫైనల్ చేసే అవకాశముందని తెలుస్తోంది. కాగా.. షర్మిల ప్రస్తుతం బెంగుళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

నేడు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. లోటస్ పాండ్ లోనే తన పార్టీకి మద్దతు తెలిపే వారిని షర్మిల కలుస్తున్నారు. భారీ వాహనాలతో ర్యాలీగా ఖమ్మం వెళ్లాలని భావించిన షర్మిల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. కోడ్ అయిపోయే వరకూ జిల్లాల నుంచే ముఖ్యమైన నేతలని హైదరాబాద్ లోటస్ పాండ్‌కు రప్పించి ఇక్కడే కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు. షర్మిల పార్టీ నేత అయిన కొండా రాఘవరెడ్డి ఆమె పర్యటన విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 20న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో.. షర్మిల ఆత్మీయ సమ్మేళనం జరగనుందని వెల్లడించారు. లోటస్‌పాండ్‌లో సుమారు 5 వేల మందికి ఆహ్వానం పంపామన్నారు. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయన్నారు. తెలంగాణలో వైఎస్సార్‌ బ్రాండ్‌తోనే ముందుకెళ్తామని కొండా రాఘవరెడ్డి వెల్లడించారు.

More News

'క‌ప‌ట‌ధారి' థీమ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

ఆర్కియాల‌జీలో ఎప్పుడో జ‌రిగిన హ‌త్య‌... హంత‌కుడు ఎవ‌రో తెలియ‌దు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా అంతు ప‌ట్ట‌ని ఆ హంత‌కుడు ర‌హ‌స్యాన్ని

మొన్న అరకు.. నిన్న కర్నూలు.. నేడు మహారాష్ట్ర.. అన్నీ ఘోరాలే..!

ఇటీవలి కాలంలో దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న అరకులో మినీ బస్సు 100 అడుగులో పడిపోయిన విషయం మరువక ముందే..

ఏపీలో మళ్లీ ఎన్నికల సమరం.. ఈసారి ఏం జరగనుందో?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చిన 10న ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్

విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ‘ఉప్పెన’

ఏమాత్రం అంచనాలు లేవు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అని తప్ప.. ఈ సినిమా హీరోయిన్ నుంచి డైరక్టర్ వరకూ అన్ని కొత్త మొహాలే.

మెగా అల్లుడి సినిమా ఎంట్రీకి నో ఛాన్స్

మెగా ఫ్యామిలీలో లేటెస్ట్ ఎడిషన్ వెంకటచైతన్య జొన్నలగడ్డ. నాగబాబు కుమార్తె నిహారిక భర్త.