శర్వానంద్ బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నూతన చిత్రం టైటిల్ 'రాధ'

  • IndiaGlitz, [Friday,February 24 2017]

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్, తన తదుపరి సినిమా ని సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "రాధ" అనే టైటిల్ ను ఖరారు చేస్తూ, శివరాత్రి సందర్భం గా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

విన్నూత్నమైన కథల తో, మంచి నటన తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న శర్వానంద్, ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రం లో కనిపిస్తారు. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. వేసవి సెలవుల్లో, ఉగాది (మార్చ్ 29) రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

శర్వ సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా కనిపించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్రమోహన్ పని చేస్తున్నారు. అయన గతం లో కరుణాకరన్ వద్ద పని చేసిన టెక్నీషియన్.

సమర్పకులు బి వి ఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, " పూర్తి వినోదాత్మకం గా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా కి రాధ అనే టైటిల్ చక్కగా సరిపోతుంది. ఉగాది రోజున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం ", అని అన్నారు.

ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత భోగవల్లి బాపినీడు.

More News

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'డి.జె.దువ్వాడ జగన్నాథమ్' టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం చిత్రం ‘డి.జె. దువ్వాడు జగన్నాథమ్’.

బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న బోయపాటి - బెల్లంకొండల చిత్రం!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది.

హ్యాపీ బర్త్ డే టు నేచురల్ స్టార్ నాని...

విలక్షణ చిత్రాల కేరాఫ్ నేచురల్ స్టార్

శివరాత్రి సందర్భంగా 'గౌతమ్ నంద' కొత్త పోస్టర్ విడుదల!

మాస్ హీరో గోపీచంద్-స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'.

మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్న 'సినీ మహల్'

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్,రేయాన్ రాహుల్,తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సినీ మహల్'.