కుమారి దర్శకుడితో శర్వానంద్..

  • IndiaGlitz, [Wednesday,April 06 2016]

రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ ఉన్న శర్వానంద్ ఇప్పుడు సినిమాల సెలక్షన్ లో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత ఇప్పటి వరకు ఓ సినిమాను కూడా ఈ హీరో కమిట్ కాలేదంటే సినిమా కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలో ఉన్నాడో తెలుసుకోవచ్చు.

లెటెస్ట్ న్యూస్ ప్రకారం కుమారి 21 ఎఫ్ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎస్ చెప్పాడట. త్వరలోనే సినిమా సెట్స్ లోకి వెళుతుందని టాక్. ప్రస్తుతానికి సూర్య ప్రతాప్ చెప్పిన లైన్ బావుందని స్క్రిప్ట్ కావాలని అడిగాడట శర్వా. ఇప్పుడు సూర్య ప్రతాప్ స్క్రిప్టింగ్ వర్క్ లో బిజీగా ఉన్నాడట.