సెప్టెంబర్ 23న విడుదల కానున్న  శర్వానంద్, సిద్దార్థ్ ‘మహా సముద్రం’ థియేట్రికల్ ట్రైలర్

  • IndiaGlitz, [Monday,September 20 2021]

విభిన్న కథలను ఎంచుకుంటూ తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 23న మహా సముద్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఇద్దరు హీరోలు రెడీగా ఉన్నట్టు పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది.

దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అందించిన రెండు పాటలకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.

నటీన‌టులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు

More News

చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమకావ్యాలే ‘లవ్ స్టోరీ ’ కి ఇన్సిపిరేషన్.- శేఖర్ కమ్ముల

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ”.

బిగ్‌బాస్ 5 తెలుగు: ఉమా దేవి ఎలిమినేషన్.. ఒక్కొక్కరి గురించి 'కుండ' బద్ధలు కొట్టింది

ఎప్పటిలానే గ్రాండ్ ఇచ్చేశారు కింగ్ నాగార్జున. 'లాహే లాహే' సాంగ్ కి డాన్స్ చేసి అలరించారు. ఎలిమినేషన్ రౌండ్ ఉన్నప్పటికీ హౌస్‌లో కంటెస్టెంట్‌లను అమ్మాయిలు, అబ్బాయిల మధ్య డాన్స్ కాంపిటిషన్ పెట్టారు.

మళ్ళీ టాలీవుడ్‌పై గురిపెట్టిన శ్రీరెడ్డి.. ఈసారి మహేశ్ బాబునే అలా అనేసింది

తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నటిగా కంటే కాంట్రవర్సీలతోనే విపరీతంగా పాపులారిటీ తెచ్చుకుంది. తనని టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు అవకాశాలు ఇస్తామని

బిగ్‌బాస్ 5 తెలుగు : హౌస్‌లో చెర్రీ సందడి.. ఓ నిజం తెలుసుకున్న నాగ్, ఈ వారం ఆ ముగ్గురూ సేఫ్

వీకెండ్‌ వచ్చిందంటే చాలు బాగా రెడీ అవుతారు హౌస్‌మేట్స్‌. వాళ్ల అందాలను చూసి మెచ్చుకునే నాగ్‌ హౌస్‌లో చేసిన తప్పొప్పులను ఎత్తి చూపుతూ చీవాట్లు కూడా పెడతాడు.

కన్నతల్లిదండ్రులపైనే కేసు పెట్టిన విజయ్... పేరు వాడుకోవడం తప్పా..?

తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ కన్న తల్లిదండ్రులపైనే కేసు పెట్టి సంచలనం సృష్టించారు. అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ తల్లిదండ్రులతో