శర్వానంద్ చేతుల మీదుగా ఉత్తేజ్ డాటర్ చేతన ఫస్ట్ లుక్ రిలీజ్

  • IndiaGlitz, [Wednesday,September 14 2016]

'కుక్కకావాలి ' అంటూ 'చిత్రం' సినిమాలో , 'నీ పేరేంటి' అంటూ 'బద్రి' సినిమాలో పవన్ కళ్యాణ్ ను క్వశ్చన్ చేసిన చైల్డ్ ఆర్టిస్ మరియు కామెడీ ఆర్టిస్ ఉత్తేజ్ కూతురైన‌ చేతన హీరోయిన్ గా న‌టిస్తున్న‌ ఫస్ట్ మువీ 'పిచ్చిగా నచ్చావ్'. శ్రీవత్స క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను కమల్ కుమార్ పెండెం , శశిభూషణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు.

సినిమాలో చేతన ఫస్ట్ లుక్ ను హీరో శర్వానంద్ ఫిలిం సిటీలో రిలీజ్ చేశారు. పోస్టర్ డిజైన్ బాగుందంటూ , చైల్డ్ ఆర్టిస్ట్ గా చేతన చేసిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో, హీరోయిన్ గా చేస్తున్న 'పిచ్చిగా నచ్చావ్ ' సినిమా అంతకంటే బిగ్ హిట్ అవ్వాలని చేతనకు మరియు ఎంటైర్ యూనిట్ కు శర్వానంద్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

చేతన మాట్లాడుతూ.... చైల్డ్ ఆర్టిస్ గా రామోజీరావు గారి 'చిత్రం' సినిమాలో పరిచయం అయ్యాను. హీరోయిన్ గా చేస్తున్న ఫస్ట్ సినిమా 'పిచ్చిగా నచ్చావ్' లోని నా ఫస్ట్ లుక్ రామోజీ రావు గారి ఫిలిం సిటీలో రిలీజ్ అవ్వడం మంచి సెంటిమెంట్ గా భావిస్తున్నాను. నా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన శర్వానంద్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.... అడగ్గానే చేతన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు శర్వానంద్ కు ఎంటైర్ యూనిట్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నాను. హీరో నాని రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్ కు , మంచు లక్ష్మీ రిలీజ్ చేసిన హీరో ఫస్ట్ లుక్ కు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో చేతన ఫస్ట్ లుక్ కు అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు . సినిమా టైటిల్ ఈజ్ తో ఎంత క్యాచీగా వుండేలా పెట్టాం. అలానే సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి అన్నారు.

డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా ఎక్స్పెక్టేషన్స్ ను ఖచ్చితంగా రీచ్ అవ్వుద్దని డైరెక్టరు శశిభూషణ్ చెప్పారు . త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రొడక్షన్ కంట్రోలర్ - పుచ్ఛా రామకృష్ణ , కెమెరా - వెంకటాహనుమ ,మ్యుజిక్ - రాం నారాయణ్ .

More News

ఎంత‌వారైనా భార్య దాసులే క‌దా

సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికిద్ద‌రు పిల్ల‌లు కూడా. ఇప్పుడు త‌న స‌తీమ‌ణి జ్యోతిక సినిమాల్లో రీ ఎంట్రీ చేయ‌డానికి సూర్య ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఎన్టీఆర్ టైటిల్ ఏంటి..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్ హ్యాట్రిక్ స‌క్సెస్‌ల‌పై ఉన్నాడు. నెక్ట్స్ మూవీ ఏం చేస్తాడ‌నే విష‌యంపై అధికార‌క స‌మాచారం అయితే లేదు కానీ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

చైతు స‌ర‌స‌న లావ‌ణ్య‌

లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుంది. న‌వంబ‌ర్ 4న చైత్య‌న హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేం క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గొన్న సునీల్

జ‌క్క‌న్న లాంటి క‌మ‌ర్షియ‌ల్ సూప‌ర్‌హిట్ చిత్రం త‌రువాత వ‌రుస‌గా ఈడు గోల్డ్ ఎహే, క్రాంతి మాద‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం , ఎన్ శంక‌ర్ నిర్మిస్తున్న చిత్రాల్లో ఫుల్ బిజిగా వున్న హీరో సునీల్ మోతిన‌గ‌ర్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గోన్నారు.

న‌న్ను త‌ల ఎత్తుకునేలా చేసిన శివ‌కు ఆజ‌న్మాంతం రుణ‌ప‌డి ఉంటాను - ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషించిన జ‌న‌తా గ్యారేజ్ దాదాపు 75 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్య‌థిక క‌లెక్ష‌