close
Choose your channels

'మ‌హా స‌ముద్రం' నుంచి 'హే రంభ‌...' సాంగ్ రిలీజ్‌

Saturday, August 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హా స‌ముద్రం నుంచి హే రంభ‌... సాంగ్ రిలీజ్‌

ఓ సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డ‌మ‌నేది అరుదుగా జ‌రిగే విష‌యం. అలాంటి అరుదైన విష‌యాలు `మ‌హా స‌ముద్రం` సినిమా అప్‌డేట్స్ విష‌యంలో జ‌రుగుతున్నాయి. అంద‌రిలో అంచ‌నాలు పెంచుతున్న ఈ సినిమా విడుద‌ల కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది.

ఈ సినిమా మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విడుద‌లైన చిన్న సాంగ్ ప్రోమోకు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి తొలి సాంగ్‌గా `హే రంభ‌...` అనే పాట ప్రోమోను చూస్తే రెగ్యుల‌ర్ మాస్ నెంబ‌ర్ కాద‌నిపిస్తోంది. అలాగే ఎవ‌ర్‌గ్రీన్ హీరోయిన్‌కు ఇది ట్రిబ్యూట్‌గా తెర‌కెక్కించినట్లు అర్థ‌మ‌వుతుంది.

ఈ సాంగ్ బీట్ వింటుంటే సాధార‌ణ‌మైన స్పెష‌ల్ సాంగ్‌లా కూడా అనిపించ‌డం లేదు. స్పెష‌ల్ లుక్‌తో డాన్సింగ్ బీట్‌ను అందించారు మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఈ పాట‌లో క‌న‌ప‌డే, రంభ గ్లామ‌ర్ క‌టౌట్‌, బ్యాన‌ర్స్‌, ఫొటోలు చూస్తుంటే రంభ ఫ్యాన్స్ అసోసియేష‌న్ ఆమె పుట్టిన‌రోజు భారీ ఎత్తున సెల్ర‌బేట్ చేసే సంద‌ర్భంగా అనిపిస్తుంది. శ‌ర్వానంద్‌, జ‌గ‌ప‌తిబాబు ఈ ప్రోమోలో రంభ‌పై త‌మ ప్రేమాభిమానాల‌ను చూపిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అలాగే ఇద్ద‌రి లుక్స్ ప‌క్కా మాస్‌గా ఉంది. వారిద్ద‌రి డాన్స్ కూడా చాలా ఫ‌న్‌ను క్రియేట్ చేస్తుంది.

చైత‌న్య భ‌రద్వాజ్ ఈ పాట‌ను త‌న‌దైన స్టైల్లో డిఫ‌రెంట్‌గా పాడారు. భారీత‌నంతో రూపొందిన ఈ పాట‌ను భాస్క‌ర భ‌ట్ల రాసిన ఈ పాట‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న `మ‌హా స‌ముద్రం`ను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చైత‌న్య భ‌రద్వాజ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాశ్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

నటీన‌టులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.