‘రణరంగం’లో ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావట్లే..! శర్వానంద్

  • IndiaGlitz, [Saturday,August 17 2019]

హీరో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ నటీనటులుగా సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రణరంగం’. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మీడియాతో ముచ్చటిస్తూ.. సినిమాకు సంబంధించి, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను నిశితంగా వివరించారు.

మేం ఊహించిన ఫలితం రాలేదు..!

‘రణరంగం’మూవీకి మంచి స్పందన వచ్చింది. కానీ మేము ఊహించినంత ఫలితం అయితే రాలేదు. ఇంకా పెద్ద విజయం సాధిస్తుందని ఉహించాము. ఐతే రివ్యూలు కొంచెం అనుకూలంగా వచ్చి ఉంట్లే ఇంకొంచెం మంచి ఫలితం అందేది. ముఖ్యంగా రణరంగం స్క్రీన్ ప్లే నచ్చి ఈ మూవీ చేయడం జరిగింది. అలాగే దర్శకుడు సుధీర్ వర్మ గత చిత్రాల టేకింగ్ నచ్చడం కూడా మరొక కారణం. రెగ్యులర్‌గా చేస్తున్న లవ్, ఫ్యామిలీ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని ఈ మూవీ నేను ఒప్పుకొని చేశాను. సినిమాలో నా పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. యంగ్ మాస్ కుర్రాడిలా, అలాగే రిచ్ గ్యాంగ్ స్టర్‌లా.. ఇలా రెండు భిన్న పాత్రల వలన నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చేశాను.

సినిమాకు దెబ్బ ఎక్కడ పడింది!

వాస్తవానికి స్క్రీన్ ప్లే బేస్డ్ స్టైలిష్ మూవీ చేద్దామనుకున్నాం... కానీ కొంచెం ఫలితం ప్రతికూలంగా వచ్చింది. అయితే మూవీ చుసిన ప్రేక్షకులెవ్వరూ బాగాలేదు అని మాత్రం అనలేదు. ప్రేక్షకుల తీర్పుకి, అలాగే రివ్యూకి సంబంధం లేదు. అందుకే ఎక్కడ తప్పు జరిగింది..? అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. రివ్యూస్ కూడా కొంచెం మంచి రేటింగ్ ఇచ్చివుంటే వసూళ్లు ఇంకొంచెం మంచిగా ఉండేవి. అలా అని రివ్యూను తప్పుబట్టట్లేదు. మీరు మూవీలో కథలేదని రాశారు.. అది నిజమే కదా. రణరంగం స్టోరీ బేస్డ్ ఫిలిం కాదు, స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం నేను చెవుతున్నాను. ‘‘కాకపోతే శర్వా మనవాడే కదా అని కొంచెం పాజిటివ్ రివ్యూ ఇచ్చి ఉంటె కొంచెం వసూళ్లు బాగుండేవని చెవుతున్నాను’’. కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కదా అని నేను కూడా నటించాను. కానీ అది వర్కవుట్ అవ్వలేదు’ అని శర్వా ఒకింత ఫీలవుతూ చెప్పాడు.

మొత్తానికి చూస్తే రివ్యూల గురించే సుమారు పది నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూలో డిస్కషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఇక ముందైనా శర్వా జాగ్రత్తపడతాడో లేకుంటే మునుపటి మాదిరిగానే గుడ్డిగా కథ విని ముందుకెళ్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

వైఎస్ జగన్ గురించి ప్రభాస్ ఏమన్నారంటే...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘సాహో’.

విజయ్‌తో డేటింగ్‌పై రష్మిక క్లారిటీ

సినీ ఇండస్ట్రీలో నటీనటులపై వార్తలకు కొదువ ఉండదు. ఏమీ లేకపోయినా వార్తలే.. అన్నీ ఉన్నా వార్తలే..

బీజేపీ వల్లే వైఎస్ జగన్ సీఎం అయ్యారా..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గెలవడానికి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కర్మ, కర్మ, క్రియ బీజేపీనేనా..?

ఆగస్ట్ 23న బోయ్ చిత్రం..

లక్ష్య, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా బోయ్.

హీరో కావాలనుకోలేదు: రజనీకాంత్

``నేను హీరో కావాలని సినిమా ఇండస్ట్రీకి రాలేదు. విలన్ అవుదామనే వచ్చాను. అయితే నన్ను హీరోగా చేసిన వ్యక్తి కలైజ్ఞానంగారే`` అని అన్నారు