శ‌ర్వానంద్‌కి స‌ర్జ‌రీ..?

  • IndiaGlitz, [Saturday,March 14 2020]

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌కి స‌ర్జ‌రీ జ‌రిగిందా? అంటే అవుననే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అదేంటి? శ‌ర్వాకు ఎందుకు స‌ర్జ‌రీ జ‌రిగింది? అనే సందేహం రావ‌చ్చు. జాను సినిమా స‌మ‌యంలో ఓ పాట చిత్రీక‌ర‌ణ‌లో శ‌ర్వానంద్ భుజానికి గాయ‌మైంది. ఆ స‌మ‌యంలో డాక్ట‌ర్స్ రెస్ట్ తీసుకోమ‌ని సూచించిన‌ప్ప‌టికీ శ‌ర్వానంద్ రెస్ట్ తీసుకోకుండా ఆ సినిమాను పూర్తి చేశాడు. అంతే కాకుండా డెబ్యూ డైరెక్ట‌ర్ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ప్ల‌స్ సినిమా ‘శ్రీకారం’ సినిమాను స్టార్ట్ చేసేశాడు. అంత త‌ర్వ‌గా సినిమాను స్టార్ట్ చేయ‌డానికి కార‌ణం.. శ్రీకారం సినిమాను ఏప్రిల్ 24న విడుద‌ల చేయాల‌నుకోవ‌డమే.

అయితే ఇప్పుడు శ్రీకారం విడుద‌ల వాయిదా ప‌డింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అందుకు కార‌ణం జాను డిజాస్ట‌ర్‌. జాను బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌ప‌డ‌టంతో శ‌ర్వానంద్ డిస‌ప్పాయింట్ అయ్యాడు. దాంతో కాస్త గ్యాప్ తీసేసుకున్నాడు. అలాగే ఈ గ్యాప్‌లోనే త‌న భుజానికి శ‌స్త్ర చికిత్స చేసేయాల‌ని కూడా నిర్ణ‌యించుకుని యు.ఎస్ వెళ్లి ఆప‌రేష‌న్ చేయించుకున్నాడ‌ట‌. ఈ ఆప‌రేష‌న్ త‌ర్వాత కాస్త కుదుట‌ప‌డి శ్రీకారం సినిమాను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నాడ‌ట శ‌ర్వానంద్‌. ఈ చిత్రంలో నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.