ముగ్గురు హీరోయిన్స్‌తో శ‌ర్వానంద్‌!!

  • IndiaGlitz, [Saturday,May 09 2020]

జాను సినిమా ప్లాప్ త‌ర్వాత శ‌ర్వానంద్ త‌దుప‌రి సినిమా శ్రీకారం సినిమాను పూర్తి చేసే ప‌నిలోఉండ‌గానే క‌రోనా ఎఫెక్ట్ వ‌చ్చింది. దీంతో శ్రీకారం సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. ఇదే స‌మ‌యంలో శ‌ర్వానంద్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి వివ‌రాల‌ను డైరెక్ట‌ర్ చందు మొండేటి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అదేంటంటే.. స‌వ్య‌సాచి సినిమా చేసిన చందు మొండేటిని విజ‌యం వెక్కిరించింది. దీంతో ఢీలా ప‌డ్డ ఆ ద‌ర్శ‌కుడు రీసెంట్‌గా శ‌ర్వానంద్‌ను క‌లిసి ఓ క‌థ వినిపించాడట‌. శ‌ర్వాకు క‌థ న‌చ్చింది. నటించడానికి ఓకే చెప్పేశాడు.అయితే అటు శ‌ర్వా హీరోగా శ్రీకారంను పూర్తి చేయాల్సి ఉండ‌గా.. మ‌రో ప‌ర‌క్క చందు మొండేటి నిఖిల్‌తో కార్తికేయ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ క‌మిట్‌మెంట్స్ పూర్త‌యిన త‌ర్వాతే శ‌ర్వానంద్, చందు మొండేటి సినిమా తెర‌కెక్క‌నుంది.

పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీ అని వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి. 1910-2121 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ని అంటున్నారు. కాగా ఈ సినిమాలో శర్వానంద్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నార‌ని చందు మొండేటి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ముగ్గురు హీరోయిన్స్‌తో సినిమా అంటే ఇదొక రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. మ‌రికొన్ని వివ‌రాలు తెలియాలంటే మ‌రికొన్నిరోజులు ఆగాల్సిందే.

More News

బాలీవుడ్ హీరోల‌కు షాకిచ్చిన ప్ర‌భాస్‌

సినిమా రంగంలో అనుకోని విష‌యాలు జ‌రుగుతుంటాయి. వెండితెర‌పై పెద్ద‌గా ప్ర‌ద‌ర్శితం కానీ సినిమాలు బుల్లితెర‌పై మాత్రం ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంటాయి.

విజ‌య్ సేతుప‌తిపై హిందూ సంఘాల ఆగ్ర‌హం

త‌మిళ ప్రేక్ష‌కుల‌కే కాదు.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి సుప‌రిచితుడే. ఇప్పుడు ఈ వైర‌టీ న‌టుడు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

వెంక‌టేశ్‌తో వెబ్ సిరీస్‌..!!

ఇప్పుడు సిల్వ‌ర్‌స్క్రీన్‌కు స‌మానంగా డిజిట‌ల్ మీడియం శ‌ర‌వేగంగా అభివృద్ధి అవుతున్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావం ఎక్కువైంది. దీంతో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. దీంతో అంద‌రికీ

ప్ర‌మాదం నుండి త‌ప్పుకున్న రానా

రానా క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న చిత్రాల్లో ‘విరాట‌ప‌ర్వం’ ఒక

‘ఆకాశ‌వాణి’ నుండి కార్తికేయ త‌ప్పుకోడానికి కార‌ణ‌మదేనా?

చాలా రోజుల క్రితం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ‘ఆకాశవాణి’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. గుణ్ణం గంగ‌రాజు త‌న‌య‌డుఉ అశ్విన్ గంగ‌రాజు