వెంకీ టైటిల్ తో శర్వానంద్

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, అక్ష‌ కథానాయికలుగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ భారీ చిత్రాన్నిరూపొందుతున్న సంగతి తెలిసిందే.
భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'డార్లింగ్‌' చిత్రానికి కరుణాకరన్‌ వద్ద అసోసియేట్‌గా వర్క్‌ చేసిన చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రేసుగుర్రం, కిక్‌2, సుప్రీమ్ చిత్రాల్లో న‌టించిన ర‌వికిష‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు 'రాధా' అనే టైటిల్ ఫిక్స్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలోశ‌ర్వానంద్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇదే టైటిల్‌తో వెంక‌టేష్‌, మారుతి సినిమా విడుద‌ల కావాల్సింది..కానీ ఆగిపోయింది. ఇప్పుడ‌దే టైటిల్‌తో శర్వానంద్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడ‌న్న‌మాట‌.

More News

సీనియర్ డైరెక్టర్ తో సుమంత్ అశ్విన్

ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్గా సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్.రాజు ఇప్పుడు హిట్ మూవీస్ లేక కామ్ అయ్యారు. ఈయన తనయుడు సుమంత్ అశ్విన్ తూనీగ తూనీగ సినిమా తెరంగేట్రం చేసి వరుస సినిమాలు చేశాడు.

'వైశాఖం' చిత్రానికి ఓ స్పెషల్ క్రేజ్ వచ్చింది

'కీసరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభమైన మా 'వైశాఖం' దిగ్విజయంగా శివరాత్రికి పూర్తయింది'

నాని, దర్శకుడు 'హనురాఘవపూడి' ల కాంబినేషన్ లో మరో చిత్రం

వరుసగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' ', 'జెంటిల్ మాన్', 'మజ్ను' 'నేను లోకల్ ' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల కధానాయకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

కె.వి.రెడ్డి అవార్డు అందుకున్న క్రిష్

'యువకళావాహిని' అధ్వర్యం లో రవీంద్రభారతిలో ఫిబ్రవరి 22న కె.వి .రెడ్డి అవార్డు ప్రదానోత్సవం ఘనం గా జరిగింది .

నారా హీరోతో మూడోసారి...

బాణం చిత్రంతో తెరంగేట్రం చేసిన యంగ్ హీరో నారా రోహిత్..