close
Choose your channels

రాజశేఖర్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కి ట్రీట్: 'శేఖర్' నుంచి కిన్నెర సాంగ్ విడుదల

Friday, February 4, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజశేఖర్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కి ట్రీట్: శేఖర్ నుంచి కిన్నెర సాంగ్ విడుదల

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసి.. ముఖంపై చెరగని చిరునవ్వుతో అందరి అభిమానాలను చొరగొంటున్నారు యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్. మూడున్నర దశాబ్ధాలకు పైగా నటనా ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు వేసి ప్రేక్షలకులను అలరించిన ఆయన.. మధ్యలో కాస్తంత గ్యాప్ తీసుకున్నా .. గరుడ వేగా, కల్కి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. కుర్రహీరోలతో సమానంగా ఈ వయసులోనూ స్టంట్స్ చేస్తూ తనలో వాడి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు రాజశేఖర్. ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ‘శేఖర్’. ఇది రాజశేఖర్ కెరీర్‌లో 91వ సినిమా కావడం విశేషం.

రాజశేఖర్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కి ట్రీట్: శేఖర్ నుంచి కిన్నెర సాంగ్ విడుదల

దీనికి ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘‘జోసెఫ్’’కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ‘‘శేఖర్’’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌‌కే మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాజశేఖర్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కి ట్రీట్: శేఖర్ నుంచి కిన్నెర సాంగ్ విడుదల

ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో, ఆయన పెద్ద కూతురు శివాని నటించడం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ రోజు డాక్టర్ రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా ‘‘శేఖర్’’ నుంచి కిన్నెర అంటూ ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా... అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ముస్కాన్ కూబ్‌చాందిని హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.