సెన్సార్ పూర్తి చేసుకున్న 'షేర్'

  • IndiaGlitz, [Monday,October 19 2015]

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షేర్‌'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అతి త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కొమర వెంకటేష్‌.

ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ - మా చిత్రం సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్‌ సభ్యులు మంచి సినిమా తీశారని అభినందించారు. కళ్యాణ్‌రామ్‌గారికి పటాస్‌ తర్వాత షేర్‌ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. బిజినెస్‌పరంగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ మల్లికార్జున్‌ టేకింగ్‌ చాలా అద్భుతంగా వుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అతి త్వరలోనే మా షేర్‌' చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తాం'' అన్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌ లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి య్లన్నగారి, మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌, మేకప్‌: మోహనరావు, కాస్ట్యూమ్స్‌: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్‌: శేషు బగ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ'స్క్రీన్‌ప్లే'దర్శకత్వం: మల్లికార్జున్‌.

More News

సుమంత్ నమ్మకం ఫలిస్తుందా?

ఎం.ఎస్.రాజు తనయుడు అనే ట్యాగ్ లైన్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ అశ్విన్.'అంతకు ముందు ఆ తరువాత','లవర్స్','కేరింత'వంటి హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అర్జున్ తో అనుష్క‌

అర్జున్ అన‌గానే సీనియ‌ర్ హీరో అర్జున్ అనుకుంటే పొర‌పాటే. విష‌యం ఏమిటంటే...అల్లు అర్జున్ తో అనుష్క న‌టిస్తుందట‌.

నాగ్‌, చైత‌న్య‌.. నాలుగోసారి

ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు హీరోల సినిమాలు ఒకే నెల‌లో విడుద‌ల‌వ‌డం అరుదు. ఈ నెల‌లో మెగా ఫ్యామిలీకి చెందిన మూడు సినిమాలు విడుద‌ల‌వ‌డం అలాంటి అరుదైన అంశమే.

ఆ ఇద్ద‌రి త‌రువాత స‌మంత‌

న‌టుడిగా 25 ఏళ్ల అనుభ‌వం విక్ర‌మ్ సొంతం. ఇటీవ‌లే పాతికేళ్ల న‌ట ప్ర‌స్థానాన్ని పూర్తి చేసుకున్నాడు స‌ద‌రు వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌.

పదేళ్ల తరువాత మహేష్ ప్రయత్నం?

'పోకిరి'..మహేష్ బాబు కెరీర్ ని అమాంతంగా పెంచిన చిత్రమిది.పాత రికార్డులన్నీ భూస్థాపితం చేసి కొత్త రికార్డులను నెలకొల్పిందీ సినిమా.