భర్తతో శిల్పాశెట్టి వార్.. పోర్న్ కాదంటూ పోలీసుల ఎదుట కంటతడి!

  • IndiaGlitz, [Monday,July 26 2021]

తన ప్రమేయం లేకుండానే బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వార్తల్లో కెక్కింది. ఇందంతా ఆమె భర్త రాజ్ కుంద్రా పుణ్యమే. పోర్న్ చిత్రాల మేకింగ్ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ రాజ్ కుంద్రా, అతడి సన్నిహితుల వాదన మాత్రం వేరేలా ఉంది. ఆయనని యాప్స్ కోసం బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లు చేస్తున్నది నిజమే అని.. కాకపోతే అవి పోర్న్ చిత్రాలు కావని, ఎరోటిక్ ఫిలిమ్స్ అని అంటున్నారు.

ఇదీ చదవండి: హాట్ ఫోటోస్: ప్రగ్యా జైశ్వాల్ బోల్డ్ షో నెవ్వర్ బిఫోర్!

ఈ మొత్తం వ్యవహారంలో శిల్పా శెట్టి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. దీనితో మానసిక వేదనతో శిల్పా శెట్టి ఇటీవల తనకు కష్టాలు కొత్త కాదని స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మీడియాలో వస్తున్నకథనాల మేరకు శిల్పా శెట్టి తన భర్తపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

విచారణ కోసం రాజ్ కుంద్రా ఇంటికి వచ్చిన సమయంలో శిల్పా శెట్టి అతడితో వాగ్వాదానికి దిగినట్లు టాక్. ఈ మొత్తం ఎపిసోడ్ లో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని, కొన్ని డీల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయని శిల్పా శెట్టి పోలిసుల ముందుకంటతడి పెట్టుకుందట. ఆర్థికంగా చాలా నష్టపోయానని శిల్పా శెట్టి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కానీ తన భర్తకు వ్యతిరేకంగా పోలీసులతో ఎలాంటి విషయాలు చెప్పలేదని పైగా వేనేసుకువచ్చినట్లు సమాచారం.

తన భర్త రాజ్ కుంద్రా నిర్మిస్తున్నవి పోర్న్ కాదని అవి ఎరోటిక్ బోల్డ్ ఫిలిమ్స్ అని పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. తన భర్త డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో శృంగార భరిత చిత్రాలు చేస్తారని వాటిని పోర్న్ అనుకోవద్దని వాంగ్మూలం ఇచ్చిందట. కానీ హాట్ షాట్స్ లో వచ్చే కంటెంట్ పై తనకు అవగాహన లేనట్లు శిల్పా శెట్టి పేర్కొంది.

ముంబై మేజిస్ట్రేట్ కోర్టు రాజ్ కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. రాజ్ కుంద్రా నుంచి పోలీసులు దాదాపు 48 టెరాబైట్స్ అస్లీల కంటెంట్ ని స్వాధీనం చేసుకున్నారట. అందులో వీడియోలతో పాటు ఫొటోస్ కూడా ఉన్నాయి.

More News

హాట్ ఫోటోస్: ప్రగ్యా జైశ్వాల్ బోల్డ్ షో నెవ్వర్ బిఫోర్!

అందం, అభినయం పుష్కలంగా ఉన్న నటి ప్రగ్యా జైశ్వాల్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం.

పిక్ టాక్: భీమ్ల నాయక్ గా పవన్ కళ్యాణ్.. ప్రీ లుక్ తో రచ్చ షురూ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

ఉప్పెన బ్యూటీ సెన్సేషనల్ డీల్.. జీ నెట్వర్క్ నుంచి భారీ రెమ్యునరేషన్!

ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి క్రేజ్ రోజు రోజుకు తారాస్థాయికి చేరుతోంది. ఉప్పెన చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ యువతని మాయ చేసిన సంగతి తెలిసిందే.

రెజీనా, నివేద రీమేక్ మూవీ అప్డేట్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో!

సురేష్ బాబు అధినేతగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం ఎక్కువగా రీమేక్ చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లు ఉంది.

నిద్రలోనే తుదిశ్వాస విడిచిన సీనియర్ నటి జయంతి!

సీనియర్ నటి జయంతి అంటే తెలియనివారుండరు. సోమవారం ఉదయం ఆమె మరణ వార్తతో అభిమానులు మేల్కోవాల్సి వచ్చింది.