'శివగంగ' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Sunday,November 08 2015]

కుమార్‌బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి.సి.వడి ఉడియాన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ. శ్రీరామ్‌, రాయ్‌లక్ష్మీ, సుమన్‌, మనోబాల, వడివుక్కరసి ముఖ్యపాత్రధారులు. షావుకారు పెట్టై పేరుతో తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అరుంధతి', కాంచన', చంద్రముఖి', గంగ', చంద్రకళ' చిత్రా తరహాలో ఈ సినిమా హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. తెలుగు, తమిళంలో విడుదకు సన్నాహాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్ లో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో తెంగాణ రాష్ట్ర హోంమినిష్టర్‌ నాయిని నరసింహారెడ్డి, సినిమాటోగ్రఫీ మినిష్టర్‌ తలసాని శ్రీనివాసయాదవ్‌, విద్యుత్‌శాఖా మంత్రి జగదీశ్వరరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ప్రభాకర్‌ రెడ్డి సహా బాలా మల్లు, అనీల్‌ సుంకర, టి.ప్రసన్నకుమార్‌, మల్కాపురం శివకుమార్‌ సహా హీరో శ్రీరామ్‌, రాయ్‌లక్ష్మి సహా దర్శకుడు వడి ఉడయాన్‌, నిర్మాత కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ జాన్‌ పీటర్‌, కెమెరామెన్‌ ఎస్‌.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను నాయిని నరసింహారెడ్డి ఆవిష్కరించారు. జగదీశ్వరరెడ్డి తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా...

తెలంగాణ హోం మినిష్టర్ నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ ట్రైలర్స్‌, సాంగ్స్‌ బావున్నాయి. శ్రీనివాసరెడ్డి మా మిత్రుడే. ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించి దర్శక నిర్మాతకు మంచి లాభాలను తీసుకురావాలి. యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

మినిష్టర్ జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ మిత్రుడు, నిర్మాత శ్రీనివాస్‌రెడ్డితో చాలా కాలంగా మంచి పరిచయం ఉంది. రెండు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలి. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

మినిష్టర్ తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది విడుదలైన పెద్ద, చిన్న సినిమాలన్నీ దాదాపుగా మంచి సక్సెస్‌ను సాధిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అలాగే శివగంగ' చిత్రం మంచి సక్సెస్‌ను సాధిస్తుంది. యూనిట్ కు మంచి పేరు రావాలి'' అన్నారు.

ఎమ్మెల్లే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ చిన్న సినిమాలే ఇండస్ట్రీకి కీలకం. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్‌ చేస్తేనే కొత్త నిర్మాతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సినిమాను హిట్‌ చేసి యూనిట్‌ను ఎంకరేజ్‌ చేస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.

చిత్ర సమర్పకులు కుమార్‌ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు, తమిళంలో హర్రర్‌ చిత్రాలకు మంచి ఆదరణ భిస్తుంది. అదేవిధంగా మా శివ గంగ' చిత్రం కూడా హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్లూస్ తో సినిమాని రూపొందిస్తున్నాం. అన్నీ కమర్షియల్‌ హంగుతో, ఉహించని ట్విస్ట్ లతో సినిమా సాగుతుంది. రెండు ఆత్మల ప్రతీకారం తీర్చుకోవడమనే కాన్సెప్ట్ తో సినిమా సాగుతుంది. తెలుగు, తమిళ ప్రేక్షకకులకు సుపరిచితుడైన నటుడు శ్రీరామ్‌ ఇందులో శివ, శక్తి అనే రెండు రోల్స్ ను పోషిస్తున్నాడు. అలాగే రాయ్‌క్ష్మీ కూడా గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ తో సత్తా చాటనుంది. 37 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతాయి. సీనియర్‌ నటుడు సుమన్‌ నెగటివ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాన్ పీటర్ మంచి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సెన్సార్‌ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని త్వరలోనే రెండు భాషల్లో విడుద చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

నిర్మాతలు కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మా సంస్థ నుండి తొలి చిత్రంగా రానున్న భారీ బడ్జెట్‌ మూవీ శివ గంగ'. హర్రర్‌ , యాక్షన్‌ విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. డైరెక్టర్‌ వి.సి.వడి ఉడయాన్‌ సినిమాని ఎక్సలెంట్‌గా తెరకెక్కిస్తున్నారు. హై టెక్నికల్‌ వాల్యూస్ ఉన్న చిత్రం. కనల్‌ కణ్ణన్‌ ఫైట్స్‌, జాన్‌ పీటర్‌ మ్యూజిక్‌, ఎస్.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్‌గా నిుస్తాయి. ఆడియో ఆకట్టుకుంటుంది. అలాగే త్వరలోనే సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

హీరో శ్రీరామ్‌ మాట్లాడుతూ కుమార్ బాబుగారు, శ్రీనివాస్ రెడ్డిగారే నాకు శ్రీరామ్ అనే పేరు పెట్టి నా తొలి చిత్రం రోజాపూలు'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. నన్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన కుమార్‌బాబు, నిర్మాతలు శ్రీనివాస్‌రెడ్డిగారే ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు సాఫ్ట్‌ రోల్స్‌ చేసిన నేను ఇలాంటి రోల్‌ చేయడం మొదటిసారి. డ్యూయెల్‌ రోల్‌ చేసిన సినిమా. రాయ్‌లక్ష్మి ఈ సినిమాలో ఎక్సలెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేసింది. ఈ సినిమా పెద్ద హిట్‌ సాధించి నిర్మాతలకు లాభాలు రావాలి'' అన్నారు.

రాయ్‌లక్ష్మి మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను హర్రర్ సినిమాల్లో నటించాను కానీ దెయ్యం గెటప్ వేసిన చిత్రమిదే. సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. శివగంగ నాకు స్పెషల్‌ మూవీ. జాన్‌పీటర్‌ మంచి సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను అందించారు. సినిమా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. అదరించాని కోరుకుంటున్నాను'' అన్నారు.

దర్శకుడు వడి ఉడయాన్‌ మాట్లాడుతూ ఈ సినిమా కోసం ప్రతి ఒక ఆర్టిస్ట్‌, టెక్నిషియన్స్‌ చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. తెలుగు, తమిళ నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ జాన్‌ పీటర్‌ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి హర్రర్‌ చిత్రం అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 'శ్రీరామ్, రాయ్ లక్ష్మి మంచి పెర్ ఫార్మెన్స్ చేశారు. జాన్ పీటర్ మ్యూజిక్, రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం'' అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు యూనిట్‌ సభ్యులను అభినందించారు.

More News

నాగ్ ప్లాన్ అప్పుడేనట...

నాగార్జున ప్రస్తుతం మనం తర్వాత ఆయన‘సోగ్గాడే చిన్ని నాయన’సినిమా షూటింగ్ పూర్త చేశారు.నిర్మాంణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తన తో సేమ్ సీజన్ లో వస్తున్న హన్సిక

పాలబుగ్గల సుందరి హన్సికకి అచ్చొచ్చిన డైరెక్టర్ గా సుందర్.సికి మంచి పేరుంది.''తీయా వేలై సెయ్యనుం కుమారా'' (తెలుగులో ''సమ్ థింగ్ సమ్ థింగ్''),''అరణ్ మణై''(చంద్రకళ)చిత్రాలతో ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి విజయాలను సొంతం చేసుకుంది.

'ఊపిరి' రిలీజ్ డేట్

ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి రీమేక్‌గా 'ఊపిరి' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున‌, కార్తీ హీరోలుగా న‌టిస్తున్న ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ కాగా.. అనుష్క గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నుంది.

ప్ర‌భాస్ బాట‌లో అఖిల్‌

కృష్ణంరాజు న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్‌కి.. నాగార్జున న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న అఖిల్‌కి హీరోలుగా చేసిన తొలి చిత్రాల విష‌యంలో కొన్ని ఫీచ‌ర్స్ ఉన్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌.

రజనీకాంత్ తెలుగు టైటిల్

సూప‌ర్ స్టార్ సౌతిండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకతవ్లో తెర‌కెక్కుతున్న సినిమా క‌బాలి నెల రోజుల షెడ్యూల్ మ‌లేషియాలో జ‌రుగుతుంది.