రెండో సినిమాకు సైన్ చేసిన శివ కందుకూరి

  • IndiaGlitz, [Sunday,February 17 2019]

పెళ్లి చూపులు సినిమాతో జాతీయ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. మొద‌టి చిత్రం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఎప్రిల్ వ‌ర‌కు మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. స‌మ్మ‌ర్ త‌ర్వాత విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. శేష సింధు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 96 చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించిన వ‌ర్ష బొల్ల‌మ్మ‌ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తున్నారు.

తొలి చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే అప్పుడే రెండో సినిమాకు సైన్ చేసారు శివ కందుకూరి. ఫిబ్ర‌వ‌రి 18న శివ కందుకూరి పుట్టిన రోజు సంద‌ర్భంగా అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఆపిల్ ట్రీ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నరాల శ్రీ‌నివాస్ రెడ్డి, పుత్తాక‌ర్ రోన్ స‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకు అజ‌య్ భూప‌తితో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన భ‌ర‌త్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎప్రిల్ నుంచి ఈ ప్రేమ‌క‌థ ప‌ట్టాలెక్క‌నుంది. గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శివ కందుకూరి తొలి సినిమాకు కూడా గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు.

More News

ఎన్టీఆర్ మహానాయకుడులో 'మహా' మిస్టేక్.. తేడా కొట్టేసిందిగా!?

దివంగత ముఖ్యమమంత్రి, ఆంధ్రుల అన్నగారు నందమూరి తారకరామారావు బయోపిక్ తీయాలని గత ఏడాది దర్శకులు పోటీపడిన సంగతి తెలిసిందే.

వెంక‌టేష్ హీరోయిన్ మారింది...

విక్ట‌రీ వెంక‌టేష్ ఈ సంక్రాంతికి `ఎఫ్‌2`తో విక్ట‌రీ కొట్టి మంచి ఊపు మీదున్నాడు. ఈ నెల 22 నుండి రాజ‌మండ్రిలో జ‌ర‌గ‌బోయే `వెంకీమామ‌`తో బిజీ కానున్నాడు.

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో చైతు రోల్‌...

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు మ‌జిలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి `వెంకీ మామ‌`లో న‌టించ‌నున్నాడు.

న‌రేంద్ర మోది.. వెబ్‌సిరీస్‌

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోది జీవితాన్ని `పిఎం న‌రేంద్ర‌మోది` చిత్రంగా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మార్చి 21న 'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2' రిలీజ్

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 .