నరేశ్ ఒకటో తేదీలోగా డబ్బులు ఖాతాలో వెయ్: శివాజీ రాజా

  • IndiaGlitz, [Tuesday,March 19 2019]

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం విషయంలో శివాజీ రాజా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టిన నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఆయన ఓ ఫైల్‌ను చూపిస్తూ పెద్ద హంగామానే చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలన్నింటికీ శివాజీ రాజా ప్రెస్‌మీట్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

మిగతా డబ్బులేమైంది?

ప్రతి సంవత్సరమూ 'మా' డైరీని అందంగా డిజైన్ చేసి వేస్తాం.. ఈ సంవత్సరమూ బాగా చేశాం. డైరీ వేసినందుకు రూ. 14.20 లక్షలు వచ్చింది అని గొప్పగా చెప్పుకున్న నరేశ్, కేవలం రూ. 7.20 లక్షలు మాత్రమే ఖాతాలో వేశారు. మిగతా డబ్బు ఏమైంది..? నేను లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చింది.

ఒకటో తేదీలోగా మిగతా డబ్బు 'మా' ఖాతాలో వేయాలి. మిగతా డబ్బు ఎక్కడుందో చెప్పి, వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది అని ఈ సందర్భంగా నరేశ్‌కు శివాజీ రాజా సలహా ఇచ్చారు. అయితే శివాజీ కామెంట్స్‌పై నరేశ్ ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

నాగబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా!

"రిటర్న్ గిఫ్ట్" ఇప్పుడీ పదం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెగ వినిపిస్తోంది. అయితే అది కాస్త టాలీవుడ్‌కూ పాకింది. ఎస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు.. నేను కూడా రిటర్న్ గిఫ్ట్

నరేశ్ నీకు ధైర్యముంటే...: శివాజీరాజా

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రమాణం చేసేందుకుగాను మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా

జనసేన తరఫున ఎంపీగా మాజీ జేడీ పోటీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈయన్ను విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా జనసేన అధిష్టానం ప్రకటించింది.

'లక్ష్మిస్ ఎన్టీఆర్' రిలీజ్‌కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మిస్ ఎన్టీఆర్'.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కించిన 'లక్ష్మీస్ వీర గ్రంథం' సినిమాల విడుదలను ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అఖిల్‌తో కైరా...

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ.. మంచి స‌క్సెస్ కోసం వెయిట్ చేయాల్సి వ‌స్తుంది. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు బాక్సాఫీస్