close
Choose your channels

నరేశ్ నీకు ధైర్యముంటే...: శివాజీరాజా

Tuesday, March 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నరేశ్ నీకు ధైర్యముంటే...: శివాజీరాజా

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రమాణం చేసేందుకుగాను మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా అడ్డుకుంటున్నారని.. ఆటంకాలు సృష్టిస్తున్నారని నరేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. శివాజీ రాజాకు సంబంధించిన కొన్ని కుంభకోణాలను సైతం బయటపెట్టిన ఆయన.. పలు సంచలన వ్యాఖ్యాలు చేశారు. అయితే ఇందుకు కౌంటర్‌గా శివాజీరాజా మీడియా మీట్ నిర్వహించి  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

శివాజీ మాటల్లోనే...

"మా నూతన మెంబర్స్ అందరికీ ఆల్‌ ది బెస్ట్. విజయవంతంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేయాలని దానికి ఇండస్ట్రీ నుంచి అందరి సహకారం అందుతుందని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. నిజంగా ప్రెస్‌మీట్ పెట్టడం నాకిష్టం లేదు.. కానీ పెట్టాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో కొందరు(నరేశ్‌‌ను ఉద్దేశించి) అడుగుతుంటే అందరికీ సమాధానం చెప్పడానికే ఇలా మీ ముందుకు వచ్చాను.

ఎన్నికలు అయిపోయాక అధ్యక్షుడు గానీ జనరల్ సెక్రటరీ గానీ హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వాళ్లవాళ్ల మనస్తత్వాలను బట్టి ఉంటుంది. హుందాగా ప్రవర్తిస్తే ఆ మర్యాద వేరేలా ఉంటుంది.. అదే చిల్లరచిల్లరగా ప్రవర్తిస్తే మరోలా ఉంటుంది. మనల్ని ఎంతో నమ్మి సభ్యులు ఎన్నుకున్నారు కాబట్టి వారి నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది" అని మా కొత్త ప్యానెల్‌ను ఉద్దేశించి  శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

ఎవరూ దుర్మార్గులుండరు!?

" 'మా'ను దయచేసి రోడ్డు మీదికి తీసుకురాకండి. నాతో సహా రోడ్డు మీదికి తీసుకురాకండి.. ఇంతకమునుపెప్పుడు ‘మా’లో రాజకీయాలు వచ్చి పడలేదు. గడిచిన నాలుగేళ్ల నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. అది మనసుకు బాధ అనిపిస్తోంది. ఇక్కడ 26 మంది సభ్యులకు జీతాలుండవ్.. 800 మంది కోసం సేవ చేయడానికి వస్తారు. ఇక్కడ ఎవరూ దుర్మార్గులు ఉండరు" అని శివాజీ రాజా తెలిపారు.

నరేశ్ నీకు దమ్ముంటే..!

"గత 26 ఏళ్లుగా ఈసీ మెంబర్ మొదలుకుని ప్రెసిడెంట్ వరకు చేశాను. ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. ‘మా’లో నేనుప్పుడూ టీ కూడా తాగలేదు. అంతగొప్పగా పనిచేసిన వ్యక్తిని నేను. సడన్‌గా వస్తారు.. ఇలా ఫైల్ చూపిస్తూ ఇందులో అంతా ఉందంటారు.. ఆ ఫైల్‌లో ఏముంటుందో తెలుసు. మీకు ధైర్యముంటే మీరు తెచ్చిన ఫైల్ ప్రెస్‌ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకిలా మోసం చేస్తున్నారు? ఫైల్‌లో విషయముంటే ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఇదిలో ఫలానా చేశారని ఎందుకు బయటపెట్టరు..? ఎందుకు పెట్టట్లేదు..? నాది తప్పయితే నేను కచ్చితంగా శిక్ష అనుభవిస్తాను.

ఆ ఫైల్‌‌లో ఏమీ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి. ఇది నేను కోపంతో అనట్లేదు.. ప్రతీసారి ఫైల్‌‌ పట్టుకుని వస్తున్నారు.. అందులో మాత్రం ఫలానా టైమ్‌లో ఫోన్, మెసేజ్ చేశాను ఇదేనా మనం ప్రజలకు చెప్పాల్సింది. అసలు మీరెంత మందికి సేవ చేశారు..? కష్టాల్లో ఉన్న వ్యక్తులను ఆదుకోవాలా లేదా.? అలాంటి ఒక కమిటీ రావాలి అని అందరూ అనుకున్నారు. మీరు కూడా అందర్నీ ఆదుకుంటారని నేను కోరుకుంటున్నాను" అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. తనను రెస్ట్ తీసుకోమన్నారు.. ఎస్ మీరు చెప్పినట్లుగానే శిరసావహిస్తూ విశ్రాంతి తీసుకుంటానని ఆయన తెలిపారు.

ఆ మాత్రం తెలియకపోతే ఎలా..?

" జీవిత కొత్తగా వచ్చింది కాబట్టి తెలియకపోవచ్చు మరీ మీకేమైంది.. ‘మా’లో బై లా ఉంది కదా చదవొచ్చుగా.. అంటే అది చదివేందుకు కూడా తమరికి టైమ్‌లేదా.. దాన్ని లాయర్ కూడా గమనించకుండా ఫోన్ చేశారు. మార్చి ఎన్నికలు జరిగి ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ప్రమాణం ఉంటుంది. నేను కూడా 25 రోజుల పాటు వేచి చూశాను.

అసలు వాళ్లు చెబుతున్నట్లుగా ఓడిపోయిన తర్వాత మాకేం అవసరం.. అసలు మీరు ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది. అరుణాచలం అనే పదాన్ని కూడా వెటకారంగా మాట్లాడారు. అవన్నీ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అందరూ పాజిటివ్‌గా ఉండండి"అని శివాజీ రాజా ఆవేదన వ్యక్తంచేశారు. కాగా శివాజీరాజా వ్యాఖ్యలకు నరేశ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో  వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.