భారీ చిత్రాలతో 'శివలింగ' నిర్మాత రమేష్ పిళ్లై

  • IndiaGlitz, [Saturday,April 08 2017]

అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై.. రాఘ‌వ‌ లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం 'శివ‌లింగ‌'. ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజ‌వుతోంది. రీసెంట్‌గా గురు చిత్రంతో స‌క్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించిన చిత్ర‌మిది. హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్ స‌హా అన్ని అంశాల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు నచ్చేలా సినిమా ఉంటుంది. క‌న్న‌డ‌లో శివ‌లింగ పేరుతో శివ‌రాజ్‌కుమార్‌గారు న‌టించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. డైరెక్ట‌ర్ వాసు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. లారెన్స్‌కి కాంచ‌న కంటే మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుంది.
ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్ ఆడియెన్‌లోకి దూసుకెళ్లింది. నేడు అభిషేక్ ఫిలింస్ అధినేత ర‌మేష్ పిళ్ళై పుట్టిన‌రోజు. దాదాపు రూ.20 కోట్ల బ‌డ్జెట్ వెచ్చించి తెర‌కెక్కించిన 'శివ‌లింగ‌' తెలుగులో ఘ‌న‌విజయం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తున్నారాయ‌న‌. ఈ సినిమాతోనే తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. త‌దుప‌రి మ‌రిన్ని చ‌క్క‌ని చిత్రాల్ని నిర్మించ‌డ‌మే ధ్యేయంగా ప‌రిశ్ర‌మ‌కి వ‌స్తున్నారు. నేడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ర‌మేష్ పిళ్లైకి శుభాకాంక్ష‌లు.⁠⁠⁠⁠

More News

సమసమాజ నిర్మాణం కోసం నడుం బిగించిన బొమ్మకు మురళి

ఉన్నత చదువులు చదివి , విదేశాల్లో ఉద్యోగం చేసి ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై సమారశంఖం పూరించి సమసమాజ నిర్మాణం కోసం పిడికిలి బిగించిన వ్యక్తి , శక్తి బొమ్మకు మురళి .

అగ్ని ప్రమాదం నుండి కమల్

యూనివర్సల్ స్టార్ కమల్హాసన్కు పెద్ద ప్రమాదమే తప్పింది. శనివారం ఈరోజు ఉదయం రెండు మూడు గంటల ప్రాంతంలో కమల్ హాసన్ ఇంట్లో నిద్ర పోతున్నప్పుడు ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

హ్యపీ బర్త్ డే టు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్

మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్కళ్యాణ్ మేనల్లుడు, సీనియర్ కమెడియన్ అల్లురామలింగయ్య మనవడు, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తనదైన గుర్తింపు సంపాదించుకుని స్టైల్ ఐకాన్గా మారాడు.

హ్యపీ బర్త్ డే టు అక్కినేని అఖిల్

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావుది ఓ చెరగని అధ్యాయం. తనదైన నటనతో ఆయన తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారు. ఆయన నట వారసుడిగా రెండవ తరంలో వచ్చిన కింగ్ నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు.

పటేల్ సార్ తో భావన.....

కిడ్నాప్,వేధింపులకు గురైన మలయాళ నటి భావన ఈ మధ్య కాలంలోవార్తల్లో వ్యక్తి అయ్యింది.