ఏప్రిల్ 14న లారెన్స్ 'శివ లింగ'

  • IndiaGlitz, [Tuesday,April 04 2017]

అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాఘ‌వేంద్ర లారెన్స్‌, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం 'శివ‌లింగ‌'. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.
ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలోసుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రైలి. అధినేత మ‌ల్కాపురం శివ‌కుమార్‌, నిర్మాత ర‌మేష్ పిళ్ళై పాత్రికేయుల‌తో మాట్లాడారు.
కాంచ‌న‌, గంగ చిత్రాల స‌క్సెస్‌ల‌తో లారెన్స్ న‌ట‌నేంటో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసింది. క‌న్న‌డంలో శివ‌రాజ్‌కుమార్ హీరోగా వాసుగారి ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డంలో రూపొందిన శివ‌లింగ చిత్రం అక్క‌డ పెద్ద స‌క్సెస్ కావ‌డంతో తెలుగు, త‌మిళంలో లారెన్స్‌, రితిక సింగ్‌ల‌పై అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ర‌మేష్ పిళ్లై నిర్మించారు. రీసెంట్‌గా గురు చిత్రంతో స‌క్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించిన చిత్ర‌మిది. హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కులకు నచ్చేలా సినిమా ఉంటుందద‌ని మల్కాపురం శివ‌కుమార్ తెలిపారు. క‌న్న‌డ‌లో శివ‌లింగ పేరుతో శివ‌రాజ్‌కుమార్‌గారు న‌టించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో లారెన్స్‌, రితిక సింగ్‌ల‌తో రీమేక్ చేశాం. వాసుగారి ద‌ర్శ‌క‌త్వంలోనే సినిమా రూపొందింది. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. లారెన్స్‌గారికి కాంచ‌న కంటే మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుందని అభిషేక్ ఫిలింస్ అధినేత ర‌మేష్ పిళ్ళై చెప్పారు.

More News

టైటిల్ రిజిష్టర్ చేసిందిఅందుకేనా...?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మరోసారి మల్టీస్టారర్ మూవీ రూపొందనుందని

బాలయ్య కోసం భారీ సెట్..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

తనపై వస్తున్న విమర్శలకు కీరవాణి ట్వీట్స్

బాహుబలి ప్రి రిలీజ్ వేడుకలో తెలుగుపాట అంపశయ్యపై ఉందని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చేసిన వ్యాఖ్యలకు చాలా మంది నెగటివ్ గా రియాక్ట్ అయ్యారు.

క్రెడిట్ అంతా మణిరత్నంగారికే దక్కతుంది - అదితిరావు హైదరీ

కార్తీ, అదితిరావు హైదరీ జంటగా నటించిన ఇంటెన్స్ ఎమోషనల్ లవ్స్టోరీ `చెలియా`. దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మద్రాస్ టాకీస్ రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ అవుతుంది.

'చెలియా' వంటి ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ చేయడం పెద్ద ఛాలెంజ్ - కార్తీ

కార్తీ, అదితిరావు హైదరీ జంటగా దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం 'చెలియా'. ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో కార్తీతో ఇంటర్వ్యూ...