close
Choose your channels

'కీచక' ఆడియో విడుదల

Thursday, September 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు, నాయుడు, వినోద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `కీచక. శ్రీ గౌతమి టాకీస్ పతాకంపై ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిషోర్ పర్వత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జోశ్యభట్ల సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ పాల్గొని ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

వి.వి.వినాయక్ మాట్లాడుతూ `ఎన్.వి.బి.చౌదరిగారు నాకు చాలా కాలంగా తెలుసు. రామానాయుడు స్టూడియోలో మాస్టర్ డిగ్రీ చేశారు. నేను కూడా ఆయన దగ్గర చిన్న చిన్న డౌట్స్ ను క్లియర్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఆయనతో మంచి పరిచయం ఉంది. ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలి. యూనిట్ కి మంచి పేరు రావాలి. ట్రైలర్, సాంగ్స్ చాలా బావున్నాయి`` అన్నారు.

దర్శకుడు ఎన్.వి.బి.చౌదరి మాట్లాడుతూ `నాగపూర్ లో జరిగిన నిజఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాను. నిర్మాత కిషోర్ గారు సపోర్ట్ మరచిపోలేను. జోశ్యభట్ల మంచి సంగీతాన్నందించారు. పెద్దోడు- చిన్నోడు, ఆదిత్య 369వంటి చిత్రాలు అందించిన శ్రీదేవి మూవీస్ సంస్థ పార్ట్నర్, సీనియర్ నిర్మాత MV రావు, రచయిత వెన్నెలకంటి కీచక చిత్ర అనువాద హక్కులు పొంది ' అసురన్' అనే పేరుతో తమిళంలో రిలీజ్ చేయనున్నారు. చెన్నైలో డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. జోశ్యభట్ల మంచి సంగీతాన్నందించారు. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.

నిర్మాత కిషోర్ పర్వతరెడ్డి మాట్లాడుతూ `మన సమాజంలో జరిగిన ఓ చెడు ఘటనపై తీసిన మూవీ. మహిళను చైతన్యపరిచే సినిమా. దర్శకుడు సినిమాని చక్కగా తెరకెక్కించారు. జోశ్యభట్ల మంచి సంగీతాన్ని అందించారు. సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. మేం చేసిన డిఫరెంట్ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ జోశ్యభట్ల మాట్లాడుతూ `అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గొరేటి వెంకన్న పాల్గొని యూనిట్ ను అభినందించారు.

ఈ చిత్రానికి కెమెరా: కమలాకర్, మాటలు: రాంప్రసాద్ యాదవ్, నిర్మాత: కిషోర్ పర్వతరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.వి.బి.చౌదరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.