టాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమవుతున్న శివాని రాజశేఖర్

  • IndiaGlitz, [Tuesday,July 18 2017]

శివాని రాజశేఖర్, ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. డా. రాజశేఖర్, జీవితల ముద్దుల తనయ అయిన తను తన అందం, అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఒక తారగా వెలగడానికి సిద్దమవుతోంది. తన తల్లితండ్రుల నట వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఈ భామ ఇటీవల చేసిన ఒక ఫోటోషూట్ చాలా మంది అగ్ర దర్శకుల దృష్టిని ఆకర్షించింది.
కంటెంట్, బ్రాండ్ బిల్డింగ్, ఫిలిం యాక్విజిషన్ మరియు ఇంటిగ్రేషన్, స్పోర్ట్స్, మ్యూజిక్ వంటి రంగాలలో ప్రవేశమున్న భారతదేశంలోనే అతి పెద్ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన క్వాన్, దక్షిణ భారతదేశపు సరికొత్త సంచలనం శివానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఫీల్ అవుతోంది. ఇంతక ముందు క్వాన్ చాలా మంది హిందీ, తెలుగు, తమిళ్ అగ్ర తారలను లాంచ్ చేయడం లో కీలక పాత్ర వహించింది.
కళలు, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో మెలుకువలు నేర్చుకుంటూనే, మెడిసిన్ కూడా చదువుతోంది శివాని. రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె అయిన శివానికి ఇండస్ట్రీ లో పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. తన ఆకర్షణీయనమైన పర్సనాలిటీ, అందం తో అందరి దృష్టిని ఇప్పటికే ఆకర్షించిన శివాని, తన సీనియర్స్ అయిన విజయ శాంతి, నయనతార, అనుష్క, ప్రియాంక చోప్రా, దీపిక పదుకోనే లాగా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని చూస్తోంది.

More News

ప్రతివాళ్ళ జీవితంలో జరిగే పోరాటమే మా 'పోరాటం' నిర్మాత శ్రీనివాస్ రావు

K3 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రావు నిర్మాతగా .. మహేంద్రన్,వినోద్ ,తను శెట్టి ,ఐశ్వర్య హీరో హీరోయిన్స్ గా తెలుగు,తమిళ్ కన్నడ బాషల్లో తెరకెక్కిన చిత్రం పోరాటం.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రథావరం'

ధర్మశ్రీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై శ్రీ మురళి,రచితారామ్ జంటగా మంజునాథ్.ఎన్ నిర్మించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో 'రథావరం'

ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో యాంగ్రీ మేన్ డా.రాజశేఖర్

సమాజం లో అంతర్గతంగా జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆరికట్టడానికి భారత ప్రభుత్వం చేత ,స్థాపించబడ్డ సంస్థ'NIA'

షూటింగ్ పూర్తి చేసుకున్న సుమంత్ 'మళ్ళీ రావా'

శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఆశీస్సులతో..... స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సుమంత్ (హీరోగా),ఆకాంక్ష సింగ్ (బద్రినాద్ కి దుల్హనియా ఫేం) ప్రధాన పాత్రదారులుగా “గౌతమ్ తిన్ననూరి” దర్శకత్వం లో “రాహుల్ యాదవ్ నక్క” నిర్మించిన రొమాంటిక్ డ్రామా “మళ్ళీ రావా”.

'వైశాఖం' చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలో నేను చాలా లక్కీ - హీరో హరీష్

ఆర్.జె. సినిమాస్ బేనర్పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వైశాఖం'. హరీష్, అవంతిక జంటగా రూపొందిన ఈ చిత్రం జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో హరీష్తో జరిపిన ఇంటర్వ్యూ.