close
Choose your channels

'పంచతంత్రం'లో లేఖ పాత్రలో శివాత్మిక రాజశేఖర్... పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

Thursday, April 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. గురువారం శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా... ఉదయం అడివి శేష్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. అలాగే, నటీనటుల వివరాలను వెల్లడించారు. గురువారం సాయంత్రం శివాత్మిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సినిమాలో ఆమె లేఖ పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు మాట్లాడుతూ "శివాత్మిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దొరసానిగా ఆకట్టుకున్న ఆమె, లేఖగా మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ఆమె పాత్రతో పాటు బ్రహ్మానందం, స్వాతి, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య పాత్రలు సినిమాలో కీలకం. 'కలర్‌ ఫొటో'తో ప్రేక్షకులతో పాటు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్‌ రాజ్‌ మా చిత్రానికి మాటలు రాయడం సంతోషంగా ఉంది. అలాగే, వరుస విజయాల్లో ఉన్న సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు’’ అని అన్నారు.

శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నేను ఓ భాగం కావడం గర్వంగా, ఎంతో సంతోషంగా ఉంది. లేఖ పాత్రలో నటించడం నా అదృష్టం" అని అన్నారు.

ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు – చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన... ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఐదు భావేద్వేగాల మిళితమైన చక్కటి కథ ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి" అని అన్నారు.

నటీనటులు: ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.