close
Choose your channels

సీనియర్ నటి శోభనకు కరోనా పాజిటివ్... ‘‘ఒమిక్రాన్’’గా నిర్ధారణ

Monday, January 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియర్ నటి శోభనకు కరోనా పాజిటివ్... ‘‘ఒమిక్రాన్’’గా నిర్ధారణ

దేశంలో సినీనటులు కోవిడ్ బారినపడుతూనే వున్నారు. ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తంగా వుండే సినీతారలను మహమ్మారి వదలడం లేదు. ప్రతిరోజూ ఒకరి వెంట మరొకరు తమకు వైరస్ సోకిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో వారి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా సీనియర్‌ శోభన కోవిడ్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

సీనియర్ నటి శోభనకు కరోనా పాజిటివ్... ‘‘ఒమిక్రాన్’’గా నిర్ధారణ

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి తాను ఒమిక్రాన్‌ బారిన పడ్డానని శోభన తెలిపారు. కీళ్లనొప్పులు, చలి, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నానని... ఇప్పటికే తనకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయ్యిందని చెప్పారు. దీని వల్ల ఒమిక్రాన్‌ ముప్పు నుంచి 85 శాతం కోలుకుంటామని నమ్ముతున్నట్లు శోభన ఆకాంక్షించారు. మరోవైపు శోభన కోవిడ్ బారినపడిన విషయం తెలుసుకున్న దక్షిణాది చిత్ర పరిశ్రమ, ఆమె అభిమానులు ఉలిక్కిపడ్డారు.

కాగా.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 13.52 లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 1,79,723 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 46,569 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రికవరీ రేటు 96.62శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,23,619 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. ఒక రోజు వ్యవధిలో 146 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనాతోపాటు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 4,033 మంది కొత్త వేరియంట్‌ బారిన పడినట్లు కేంద్రం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,216 ఒమిక్రాన్‌ కేసులు వుంటే.. ఆ తర్వాత రాజస్థాన్‌ 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441 మంది బాధితులున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.