Koratala Siva: కొరటాల శివకు షాక్.. క్రిమినల్ కేసు ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

  • IndiaGlitz, [Monday,January 29 2024]

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మరోసారి వార్తల్లో నిలిచారు. 'శ్రీమంతుడు' కథ విషయంలో ఏడేళ్లుగా జరుగుతున్న రచ్చ విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసును ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. స్వాతి పత్రికలో వచ్చిన తన కథ ఆధారంగా ‘శ్రీమంతుడు’ సినిమాగా తీశారని శరత్‌ చంద్ర అనే రచయిత ఏడేళ్ల క్రితం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టును కొరటాల ఆశ్రయించారు.

అయితే 'శ్రీమంతుడు’ కథను కాపీ కొట్టారనే ఆధారాలను శరత్‌ చంద్ర హైకోర్టుకు సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిజమే అని నిర్థారించింది.. అలాగే రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో కొరటాల సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. దీనిపై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

సినిమా విడుదలైన 8 నెలల తర్వాత రచయిత కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరపున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని తీర్పు స్పష్టంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇందులో తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టంచేసింది. పిటిషన్‌ను డిస్మిస్‌ చేయమంటారా? లేదా మీరే వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని నిరంజన్ రెడ్డి చెప్పడంతో అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కొరటాలకు సుప్రీంలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

కాగా మహేష్ బాబు హీరోగా 2015లో విడుదలైన 'శ్రీమంతుడు' సినిమా బ్లాక్‌బాస్టర్‌ అయింది. బాక్సాఫీస్ కసూల వర్షం కురిపింది. అలాగే కొరటాల, మహేష్ కెరీర్‌లోనే మైలురాయి చిత్రంగా నిలిచింది. ఓ పెద్ద పారశ్రామికవేత్త కుమారుడు తన తండ్రి పుట్టి, పెరిగిన ఊరిని దత్తత తీసుకుని ఎలా అభివృద్ధి చేశాడన్నదే ఈ సినిమా కథ. ఇక కొరటాల సినిమాల విషయానికొస్తే ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో తీసిన 'ఆచార్య' సినిమా పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని జూనియర్ ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో 'దేవర' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 70శాతం పైగా పూర్తి అయింది. ఈ సినిమాను రెండు పార్టులుగా తీస్తున్నారు. మొదటి పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించారు.

More News

జగన్ సభలు కళకళ.. చంద్రబాబు సభలు వెలవెల..

రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. ఓవైపు పాండవ సైన్యం.. మరోవైపు కౌరవుల సైన్యం మధ్య యుద్ధం జరగనుంది. పాండవుల సైన్యానికి అర్జునుడిలా సీఎం జగన్‌ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Rajya Sabha:రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీ ఇదే..

లోక్‌సభ ఎన్నికల కంటే ముందు మరో కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. త్వరలో 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 56 మంది రాజ్యసభ సభ్యుల

Animal:ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన 'యానిమల్'.. ఉత్తమ నటుడు ఎవరంటే..?

హిందీ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్‌’ (Film Fare awards) అవార్డుల్లో 'యానిమల్' చిత్రం సత్తా చాటింది.

Rashmika:సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది.. రష్మిక వ్యాఖ్యలు వైరల్..

రష్మిక మందన్న.. నేషనల్ క్రష్‌గా ఫుల్ పాపులారింటీ దక్కించుకున్నారు. 'పుష్ప' సినిమాతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా స్థిరపడ్డారు.

Chandrababu: ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వం పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.