ఏపీ హైకోర్టులో జగన్‌ సర్కార్‌కు ఊహించని షాక్

  • IndiaGlitz, [Thursday,August 22 2019]

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన ‘పోలవరం’ రివర్స్ టెండరింగ్‌ వేసి తీరుతామని జగన్ సర్కార్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. పోలవరం నిర్మాణానికి ఓ అమౌంట్‌ను కోడ్ చేసి టెండర్లకు కూడా పిలుపునిచ్చింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పూర్తివివరాలను సైతం నిశితంగా వివరించింది. అయితే.. జగన్ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదని.. తాము తీవ్రంగా నష్టపోతామని భావించిన నవయుగ నిర్మాణ సంస్థ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

గురువారం నాడు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. జగన్ సర్కార్‌కు ఊహించని షాకిచ్చింది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు సైతం జారీ చేయడం జరిగింది. నవయుగకు హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

ఇదిలా ఉంటే.. రివర్స్ టెండరింగ్‌పై పీపీఏ అభ్యంతరం తెలిపినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం దాన్ని పట్టించుకోలేదన్న విషయం విదితమే. అంచనా వ్యయం పెరిగిందని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్ చేపట్టింది. ప్రజాధనం ఆదా చేయడమే రివర్స్ టెండరింగ్ ఉద్దేశం అని చెప్పింది. ఈ మేరకు మొత్తం రూ.4,987.5 కోట్లతో రివర్స్ టెండరింగ్‌కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలను పీపీఏ కేంద్రానికి పంపించింది. దీంతో రివర్స్ టెండరింగ్ అవసరం ఏమొచ్చిందని కేంద్రం ఆరా తీస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రాజెక్టు నిర్మాణ పనులు, చెల్లించాల్సిన బిల్లులు వంటి లెక్కలు తెలపాల్సిందిగా పీపీఏని అడిగింది.

కాగా.. ప్రభుత్వం దురుద్దేశంతో జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేసిందని.. కేవలం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయంతోనే ఈ పనికి పూనుకుందని నవయుగ ఆది నుంచి మొత్తుకుంటోంది. అంతేకాదు.. కొత్తగా ఆహ్వానించిన టెండరు నోటిఫికేషన్‌లో 58 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని.. తాము గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2021 నవంబరు నాటికే ప్రాజెక్టును పూర్తి చేసి ఇస్తామని నవయుగ సంస్థ ఏపీ హైకోర్టుకు గతంలోనే విన్నవించుకున్న విషయం విదితమే.

More News

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

తెలుగువాడైన కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి ఆగిపోనుందా? అంటే అవునని గుస‌గుస‌లు వినిపించాయి.

గోడ దూకి మరీ చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరంను నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

'నమ్మేలా లేదే' అంటున్న 'రాజావారు రాణిగారు'

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో బాగా హైలైట్ అయిన పేరు 'రాజావారు రాణిగారు'.పోస్టర్లతో టీజర్ తో జనాలలో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం గతవారమే మొదటి పాట ద్వారా ప్రజలకు మరింత చేరువైంది.

`సాహో` సెన్సార్ పూర్తి..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో హీరోయిన్‌గా రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన దివ్యవాణి

టాలీవుడ్ సీనియర్ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతోందని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.