దుబ్బాక దంగల్‌లో హరీష్‌రావు, ఉత్తమ్‌, సీతక్కలకు షాక్..

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 10 రౌండ్ల వరకూ బీజేపీ దాదాపుగా హవా కొనసాగిస్తూ వచ్చింది. ఆ తరువాతి నుంచి టీఆర్ఎస్ వరుసగా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమతమైంది. టీఆర్ఎస్, బీజేపీలతో పోలిస్తే.. చాలా తక్కువ ఓట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. కాగా.. దుబ్బాక కౌంటింగ్‌లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యాన్ని కనబరిచింది. ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామమైన పోతారంలో 110 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రుద్రారంలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యాన్ని కనబరిచింది. అక్కడ టీఆర్‌ఎస్‌కు 750, బీజేపీ 595, కాంగ్రెస్‌కు 395 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 163 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆ గ్రామంలో 520 ఓట్లు పోలవగా, బీజేపీకి 490 ఓట్లు పోల్ అయ్యాయి. టీపీసీసీ చీఫ్‌గా ఈ పరిణామం ఆయనకు కాస్త ఇబ్బందికరమే అని చెప్పాలి.

ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహించిన గ్రామాల్లో సైతం బీజేపీనే పైచేయి సాధించి సంచలనం సృష్టించింది. కాగా.. దుబ్బాక దంగల్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దుబ్బాక అనేది మంత్రి హరీష్ రావు అడ్డాలోనే ఉంది. దీంతో ఆయన అంతా తానై ప్రచారం కొనసాగించారు. కానీ.. ట్రబుల్ షూటర్‌గా, ఉపఎన్నికల కింగ్‌గా పేరు గాంచిన మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో బీజేపీ ఆధిక్యాన్ని కనబరచడం సంచలనంగా మారింది. హరీష్ రావు దత్తత గ్రామమైన చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి హరీష్‌రావుకి షాక్ ఇచ్చింది.

More News

దుబ్బాక: 2009 నుంచి ఎన్నికల ఫలితాలు ఆసక్తికరమే..

దుబ్బాక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి నేటి ఉప ఎన్నిక వరకూ ఆసక్తికరంగా మారుతూనే ఉన్నాయి.

షూటింగ్‌ను ప్రారంభించుకున్న ‘పుష్ప’..

అల్లు అర్జున్‌ హీరోగా ప్యాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’ రూపొందుతున్న విషయం తెలిసిందే.

అమ్మ రాజశేఖర్‌ను కొంత వరకూ మరిపిస్తున్న అరియానా..

ఓపెనింగే.. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినందుకు సొహైల్ ఒకవైపు, అరియానా మరోవైపు ఏడుపు సీన్..

దుబ్బాక: తొలిరౌండ్‌లో ఆధిక్యంలో బీజేపీ...

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. తొలి రౌండ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.

దుబ్బాక కౌంటింగ్ ప్రారంభం.. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ..

సిద్దిపేట: నేడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది.