close
Choose your channels

తార‌క్ ఫ్యాన్స్‌కు షాక్‌...

Monday, May 18, 2020 • తెలుగు Comments

తార‌క్ ఫ్యాన్స్‌కు షాక్‌...

మే 20న తార‌క్ పుట్టిన‌రోజు. ఈ రోజు కోసం తార‌క్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కార‌ణం ‘రౌద్రం ర‌ణం రుధిరం (ఆర్ఆర్ఆర్‌)’. భారీ అంచనాల నడుమ తెరుకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో న‌టిస్తున్నాడు. ఈయ‌న పాత్ర‌కు సంబంధించిన వీడియో ప్రోమోను చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. దీనికి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో అంద‌రూ తార‌క్ వీడియో ప్రోమో కోసం ఎదురుచూస్తున్నారు. అయితే లాక్‌డౌన్ వ‌ల్ల తాము తార‌క్ వీడియోను విడుద‌ల చేయ‌లేక‌పోవ‌చ్చున‌ని అందుకు సంబంధించిన షూటింగ్‌, వీడియో ఫుటేజ్ త‌మ ద‌గ్గ‌ర లేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు రాజ‌మౌళి. అంతే కాకుండా.. ఏదో విడుద‌ల చేసేయాల‌ని కాకుండా మంచి అవుట్‌పుట్‌నే ఇవ్వ‌డానికి తాను ప్ర‌య‌త్నిస్తాన‌ని రాజ‌మౌళి తెలిపారు.

అన్న‌ట్లుగానే ఆయ‌న బెస్ట్ అవుట్ పుట్ రాలేద‌ని, అందుక‌ని తార‌క్ ఫ‌స్ట్ లుక్ లేదా వీడియో ప్రోమోను విడుద‌ల చేయ‌లేపోతున్నామ‌ని అధికారికంగా తెలిపారు. అయితే ఎప్పుడు తార‌క్ వీడియో వ‌చ్చిన అది అంద‌రికీ పండుగే అవుతుంద‌ని ఆర్ఆర్ఆర్ యూనిట్ తెలియ‌జేసింది. లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా విడుద‌ల కూడా వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుండి ద్వితీయార్థంలోకి వాయిదా ప‌డింది.

Get Breaking News Alerts From IndiaGlitz