close
Choose your channels

ఆర్జీవీకి షాక్‌!!

Wednesday, July 29, 2020 • తెలుగు Comments

ఆర్జీవీకి షాక్‌!!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఆర్జీవీ లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో క్లైమాక్స్, నగ్నం, కరోనా వైరస్‌లతో పాటు ఈ క్ర‌మంలో ఆర్జీవీ రీసెంట్‌గా చేసిన చిత్రం ‘ప‌వ‌ర్‌స్టార్‌’. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ తెర‌కెక్కించిన చిత్రం ‘ప‌వ‌ర్‌స్టార్‌’. ఈ సినిమా విడుద‌లైన‌ప్ప‌టికీ ఈ సినిమా విష‌యంలో ఆర్జీవీ తీసుకున్న ప్ర‌మోష‌న‌ల్ నిర్ణ‌యాలు ఆయ‌న‌కు కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతున్నాయి.

రీసెంట్‌గా సెంట్ర‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆర్జీవీకి ‘ప‌వ‌ర్‌స్టార్’ విష‌యంలో పెద్ద షాకిచ్చింది. అనుమ‌తి లేకుండా ‘పవర్‌స్టార్‌’ సినిమా పోస్ట‌ర్స్‌ను అతికించ‌డంపై సెంట్ర‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ‘ప‌వ‌ర్‌స్టార్’ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా 30 పోస్ట‌ర్స్‌ను అతికించారు. ఎన్ఫోర్స్మెంట్, డీఆర్ఎఫ్ బృందాల తనిఖీలలో ఏ ఒక్క దానికి అనుమతి తీసుకోలేదని నిరూప‌ణ అయ్యింది.

దీంతో అనుమ‌తి లేని పోస్ట‌ర్స్‌కు రూ.88 వేలు జ‌రిమానా విధించారు. ఇటీవ‌ల జీహెచ్ఎంసీ కూడా ‘పవర్‌స్టార్‌’ సినిమాకు సంబంధించి నిర్మాత‌ల‌కు నాలుగు వేల రూపాయ‌ల జ‌రిమానా విధించిన సంగ‌తి తెలిసిందే.

Get Breaking News Alerts From IndiaGlitz