టికెట్ దక్కించుకున్న టీడీపీ అభ్యర్థికి ఊహించని షాక్!

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అటు వైసీపీ.. ఇటు టీడీపీ అధిష్టానాలు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల విజయవాడ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించినప్పటికీ వారిలో ఒకరైన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నారు. సీఎం చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించేశారు అంతా అయిపోయిందనకుంటున్న టైమ్‌‌లో మాజీ మేయర్ మల్లికా బేగం రూపంలో ఊహించని షాక్ తగిలింది. షబానా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడాన్ని మల్లికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఇంతకీ వివాదం ఏంటి..?

2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు నేను సిద్ధం కాగా.. నాకు ఓటేయరాదని జలీల్ ఖాన్ మతపెద్దల చేత ఫత్వా జారీ చేయించారు. ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధం అవుతోంది. కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీచేసి తీరాల్సిందే అని మల్లికా పట్టుబట్టారు. మరోవైపు ఈ విషయమై మాట్లాడేందుకు మతపెద్ద, గతంలో పత్వా జారీ చేసిన మౌలనా ఇంటికి మల్లికా వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటిముందే బేగం బైఠాయించారు. ఈ విషయంలో వవెనక్కి తగ్గే ప్రసక్తేలేదని.. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపనని బేగం చెబుతున్నారు. కాగా విజయవాడ పశ్చిమ టికెట్ కోసం నాగూర్ మీర ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తానికి చూస్తే.. ఎన్నికల ముందే పశ్చిమ టికెట్ విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇలా షబానాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయ్. ఈ తరుణంలో చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు..? అసలు ఆమెను బరిలోకి దింపుతారా..? ఈ గొడవలన్నీ ఎందుకులే అని మూడో వ్యక్తి సీటిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.