చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీకి కోలుకోలేని షాక్...

  • IndiaGlitz, [Thursday,June 20 2019]

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో కుటుంబీకులతో బిజిబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో పలువురు ముఖ్యనేతలు, కాపునేతలు, ఎంపీలు జంప్ టీడీపీకి టాటా చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన కాపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు రహస్యంగా సమావేశయ్యారు. ఈ సమావేశానికి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికైంది. సమావేశంలో తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేష్ బాబు, జ్యోతుల నెహ్రూ, బొండ ఉమా, ఈలి నాని సహా పలువురు కాపు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని బట్టి చూస్తే ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా కోలుకోని టీడీపీకి మరో కోలుకోలేని షాక్ తగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సమావేశంలో కాపుల భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? బీజేపీలో చేరాలా..? వైసీపీలో చేరాలా..? అనే విషయంపై చర్చించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా.. సమావేశం అనంతరం కాపు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాయి. టీడీపీకి కాపు సామాజికవర్గం దూరం అవడం వల్లే ఓడిపోయాము. దీనికి గల కారణాలు, నష్టనివారణ చర్యలపై సమావేశంలో నిశితంగా చర్చించాము. కాపులకు టీడీపీని వీడాల్సిన అవసరం లేదు. రాజ్యసభ సభ్యులకు పనులుంటాయ్ కాబట్టి వారు మారుతుండొచ్చేమో కానీ మేం మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల్లో తిరుగుతామని.. ప్రజలకు దగ్గరయ్యే మార్గాలను అన్వేషిస్తాము. కష్టనష్టాలను కలిసి ఎదుర్కోవాలని సమావేశంలో నిర్ణయించాము. మేం బీజేపీలో.. వైసీపీలోకే వెళ్లాల్సిన అవసరం లేదు అని జ్యోతుల నెహ్రూ మీడియాకు వివరించారు.

అయితే ఫైనల్‌గా ఇప్పుడున్న కాపునేతల్లో ఎంతమంది టీడీపీలో ఉంటారో.. ఎంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకుంటారో..? ఎంత మంది కమలం గూటికి చేరతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

'అక్షర' టీజర్ లాంచ్

హీరోయిన్ నందితశ్వేతా ప్రధాన పాత్రలో బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మించిన చిత్రం ‘అక్షర’

బెదిరింపుల‌కు లొంగేది లేదు: ప్ర‌శాంత్ గౌడ్‌

‘‘ఓటర్‌’ సినిమా విడుద విషయంలో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాని ఆపాలంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా

బలమైన కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేశాడు.

లాంఛ‌నంగా ప్రారంభ‌మైన క‌ల్యాణ్ రామ్ కొత్త చిత్రం

నెంబ‌ర్ వ‌న్ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలో తొలిసారి అడుగుపెట్టింది. శ్రీదేవీ మూవీస్ అధినేత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో

చేతులు కలపనున్న విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్‌

ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఓ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం కోసం చేతులు క‌ల‌ప‌బోతున్నారు.