close
Choose your channels

చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీకి కోలుకోలేని షాక్...

Thursday, June 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీకి కోలుకోలేని షాక్...

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో కుటుంబీకులతో బిజిబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో పలువురు ముఖ్యనేతలు, కాపునేతలు, ఎంపీలు జంప్ టీడీపీకి టాటా చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన కాపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు రహస్యంగా సమావేశయ్యారు. ఈ సమావేశానికి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికైంది. సమావేశంలో తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేష్ బాబు, జ్యోతుల నెహ్రూ, బొండ ఉమా, ఈలి నాని సహా పలువురు కాపు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని బట్టి చూస్తే ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా కోలుకోని టీడీపీకి మరో కోలుకోలేని షాక్ తగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సమావేశంలో కాపుల భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? బీజేపీలో చేరాలా..? వైసీపీలో చేరాలా..? అనే విషయంపై చర్చించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా.. సమావేశం అనంతరం కాపు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాయి. "టీడీపీకి కాపు సామాజికవర్గం దూరం అవడం వల్లే ఓడిపోయాము. దీనికి గల కారణాలు, నష్టనివారణ చర్యలపై సమావేశంలో నిశితంగా చర్చించాము. కాపులకు టీడీపీని వీడాల్సిన అవసరం లేదు. రాజ్యసభ సభ్యులకు పనులుంటాయ్ కాబట్టి వారు మారుతుండొచ్చేమో కానీ మేం మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల్లో తిరుగుతామని.. ప్రజలకు దగ్గరయ్యే మార్గాలను అన్వేషిస్తాము. కష్టనష్టాలను కలిసి ఎదుర్కోవాలని సమావేశంలో నిర్ణయించాము. మేం బీజేపీలో.. వైసీపీలోకే వెళ్లాల్సిన అవసరం లేదు" అని జ్యోతుల నెహ్రూ మీడియాకు వివరించారు.

అయితే ఫైనల్‌గా ఇప్పుడున్న కాపునేతల్లో ఎంతమంది టీడీపీలో ఉంటారో.. ఎంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకుంటారో..? ఎంత మంది కమలం గూటికి చేరతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.