టీవీ9 రవిప్రకాష్‌కు హైకోర్టులో ఊహించని షాక్..

  • IndiaGlitz, [Wednesday,May 22 2019]

టీవీ9 వివాదంలో పోలీసుల దొరకకుండా పరారీలో ఉన్న మాజీ సీఈవో రవిప్రకాష్‌కు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే పోలీసుల ఎదుట హాజరుకాకుండా ముందస్తు బెయిల్ తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించగా.. చుక్కెదురైంది. అయితే ఇటీవల మరోసారి ఆయన కోర్టును ఆశ్రయించగా.. ఈసారి కూడా రవిప్రకాష్‌కు కోర్టు కోలుకోలేని.. ఊహించని షాకిచ్చింది.

బెయిల్ పిటిషన్‌ను బుధవారం హైకోర్టులో విచారణకు రాగా.. బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదని రవిప్రకాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రవిప్రకాష్ తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపించారు. పోలీసులు మూడు సార్లు నోటీసులిచ్చినా విచారణకు ఎందుకు రాలేదని ప్రభుత్వ న్యాయవాది సూటి ప్రశ్న సంధించారు. ఇందుకు రవిప్రకాష్ లాయర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. వాట్సప్ కాల్స్‌లో అందుబాటులో ఉంటూ విచారణకు రావడం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్ట్ జడ్జ్‌కు వివరించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అనంతరం తీర్పునిచ్చిన హైకోర్టు రవిప్రకాష్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.

ఇదిలా ఉంటే.. రవిప్రకాష్ ఏం చేయబోతున్నాడు..? ఇక వేరే మార్గాలేమీ లేకపోవడంతో విచారణకు వస్తాడా..? లేకుంటే మరికొన్ని రోజులు పరారీలోనే ఉంటారా..? అనేదానిపై అటు పోలీసు.. ఇటు టీవీ9 కొత్త యాజమాన్యంలో ఆసక్తి రేపుతోంది. కాగా.. బుధవారం ఉదయం తాను ఎక్కడికి పారిపోలేదని.. అసలు తనమీదున్న కేసులు ఇవని ఓ వీడియోను రవిప్రకాష్ విడుదల చేశారు. సో.. మున్ముంథు పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.

More News

‘సీత’ సినిమాతో శ్రీనివాస్ 'ఉయ్..' అనిపిస్తాడా..!?

యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న  చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

350 థియేటర్స్ లో విడుదల అవుతున్న అల్లాదీన్

అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఈ కథ ని ఎన్ని సార్లు సినిమా తీసిన, చూసిన ప్రతి సారి కొత్తగానే ఉంటుంది.

వచ్చే నెలలో ‘పోలీస్‌ పటాస్‌’

అయేషా హబీబ్‌, రవి కాలే, కురి రంగా కీలక పాత్రధారులు కన్నడంలో రూపొందిన 'జనగణమన' చిత్రం 'పోలీస్‌ పటాస్‌' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

వివాదాల్లో 'సీత‌'

ఈ మ‌ధ్య సినిమాలు విడుద‌ల‌వుతున్నాయంటే వివాదాలు కామ‌న్‌గా మారిపోయాయి. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో రూపొందిన 'సీత‌' కూడా  వివాదాల్లో చిక్కుకొంది.

బ‌న్నీ 19 విడుద‌ల అప్పుడేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్