హీరో విజయ్ కి షాక్.. చివాట్లు పెట్టిన హైకోర్టు, సినిమాల్లో కరెప్షన్ కి వ్యతిరేకం

  • IndiaGlitz, [Tuesday,July 13 2021]

ఇలయథలపతి విజయ్ కి మద్రాస్ హైకోర్టులో షాక్ తగిలింది. ఊహించని విధంగా ఈ అగ్ర హీరో కోర్టు నుంచి చివాట్లు ఎదుర్కొన్నాడు. అంతేకాదు మద్రాసు హైకోర్టు రూ లక్ష జరిమానా కూడా విధించింది. వివరాల్లోకి వెళితే.. విజయ్ 2012లో ఇంగ్లాండ్ నుంచి రోల్స్ రాయిస్ గోస్ట్ అనే ఖరీదైన కారుని దిగుమతి చేసుకున్నారు. దాని విలువ రూ 8 కోట్ల వరకు ఉంటుంది.

ఈ కారుకు ఎంట్రీ టాక్స్ రూపంలో విజయ్ 1.6 కోట్ల వరకు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే తాను ఇంపోర్ట్ టాక్స్ చెల్లించానని విజయ్ హై కోర్టుని ఆశ్రయించారు. ఇంపోర్ట్ టాక్స్ చెల్లించాను. ఇప్పుడు అధికారులు ఎంట్రీ టాక్స్ చెల్లించాలని చాలా భారీ మొత్తం అడుగుతున్నారు. ఎంట్రీ టాక్స్ నుంచి తనకు మినహాయింపు కల్పించండి అని విజయ్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే న్యాయస్థానం విజయ్ పిటిషన్ ని కొట్టిపారేసింది. టాక్స్ చెల్లించనందుకు గాను రూ లక్ష జరిమానా విధించింది. టాక్స్ కూడా విధిగా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు చెల్లించాలని న్యాయస్థానం విజయ్ ని ఆదేశించింది.

ఈ సందర్భంగా కోర్టు విజయ్ కు చివాట్లు పెట్టింది. విజయ్ లాంటి స్టార్ హీరోలు టాక్స్ చెల్లించకపోవడం ఏంటి అని ప్రశ్నించింది. హీరోలు సమాజంపై చాలా ప్రభావం చూపుతారు. గతంలో సినిమాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేశారు. అలాంటి హీరోలు ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. సినిమాల్లో మాత్రమే కరెప్షన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే సరిపోదు అని కోర్టు తెలిపింది. రీల్ హీరోలు రియల్ హీరోలుగా నిలవాలి అని జస్టిస్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. హీరో విజయ్ సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ఒకరు.

విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.

More News

కంఫర్మ్: సౌరవ్ గంగూలీ బయోపిక్ కి అంతా రెడీ.. హీరో ఎవరో తెలుసా!

ఇండియన్ క్రికెట్ కి కొత్త ఊపు తీసుకువచ్చిన క్రికెటర్ సౌవర్ గంగూలీ. మూసగా సాగుతున్న ఇండియన్ క్రికెట్ ని తన అగ్రెసివ్ నిర్ణయాలతో పరుగులు పెట్టించాడు. యువతకు పెద్ద పీఠవేసి కొత్త

క్రేజీ విలన్ ఇల్లు సీజ్ చేసిన అధికారులు.. వణుకు పుట్టించే రీజన్!

కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వేవ్ తర్వాత మరో వేవ్ ఇలా ప్రజలపై కరోనా దాడి కొనసాగుతూనే ఉంది.

కత్తి మహేష్ మృతిపై డౌట్స్ ఇవే.. విచారణకు డిమాండ్

గత నెల జూన్ 26న ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కారు ప్రమాదానికి గురికావడం, చికిత్స పొందుతూ ఇటీవల మరణించడం తెలిసిందే. కత్తి మహేష్ చిత్తూరులోని తన స్వగ్రామానికి వెళుతుండగా

స్వాతి రెడ్డి ఫోటో వైరల్.. ఫేక్ ప్రచారం, అసలు క్లారిటీ ఇదిగో!

దేశం గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ. మగువల అందాన్ని పొగడాలంటే ఆయన పెయింటింగ్స్ తో పోల్చాల్సిందే. అంతగా రాజా రవివర్మ ఆర్ట్ వర్క్ అందరిని మంత్ర ముగ్దుల్ని చేసింది.

వైరల్ వీడియో: అమీర్ ఖాన్ నీతులు బాగానే చెబుతాడు.. అసలు నిర్వాకం ఇదీ!

సెలెబ్రెటీలకు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విమర్శకులకు టార్గెట్ గా మారారు. కెమెరాల ముందు నీతులు