లండన్‌‌ వెళ్లిన జగన్‌‌కు కొన్ని గంటల్లోనే షాక్!?

  • IndiaGlitz, [Thursday,February 21 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కుమార్తె వర్షా రెడ్డితో హాయిగా గడుపుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి ఆయనకు షాకింగ్ న్యూస్ వెళ్లింది.! వైసీపీ వ్యవస్థాపకుడైన కొలిశెట్టి శివకుమార్‌‌‌‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎన్నికల కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ మార్చి 11లోపు వివరణ ఇవ్వాలని వైసీపీ అధినేత వైఎస్‌‌ జగన్‌‌కు సీఈసీ ఆదేశించింది.

అసలు విషయానికొస్తే.. వైసీపీ అంటే జగన్.. జగన్ అంటే వైసీపీ అనే విషయం అందరికీ టక్కున గుర్తొస్తుంది కానీ.. కాస్త లోతుగా చర్చలోకెళితే.. వైసీపీ పార్టీ అనేది కొలిశెట్టి శివకుమార్‌‌ది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణాంతరం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ ని స్థాపించారు. నిజానికి ఈ విషయం చాలా మందికి తెలియదు.. ఆ తర్వాత జగన్‌‌ను ఆయన కలవడం పార్టీ గుర్తు మొత్తం జగన్‌‌ టేకోవర్ చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయ్. అప్పటి వరకూ అంతా సాఫీగానే ఉందనకున్న టైమ్‌‌లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జగన్-శివకుమార్ మధ్య యుద్ధం తెచ్చిపెట్టాయి. టీఆర్ఎస్‌‌కు సపోర్ట్ చేయాలని జగన్.. వద్దని శివకుమార్ ఇలా అప్పట్లో హడావుడే జరిగింది. ఈ క్రమంలో శివకుమార్‌‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ అధిష్టానం ప్రకటించింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన శివకుమార్.. కోర్టు మెట్లెక్కారు. మరోవైపు ఈ వ్యవహారం ఈసీకి సైతం ఫిర్యాదు చేయడంతో జగన్‌‌కు వైసీపీ నోటీసులిచ్చింది. అయితే వైసీపీ తరఫున ఈ విషయంపై ఎవరు స్పందిస్తారు..? మీడియా ముందుకెవరస్తారు..? ఎన్నికల కమిషన్‌‌కు వివరణ ఎవరిస్తారు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే ఎన్నికల ముందు జగన్‌‌కు ఇదో షాక్ అనే విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై జగన్ ఎలా ముందుకెళ్తారు..? నోటీసులకు ఎలా రియాక్టవుతారు..? అనే విషయాలు తెలియాలంటే జగన్‌‌ లండన్‌‌ నుంచి హైదరాబాద్‌‌కు వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

ప్రియురాలి కోసం ప్రొడ్యూస‌ర్‌గా...

కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార సినిమాల‌కు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది.. లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో న‌య‌న సినిమాలు 50 కోట్ల క్ల‌బ్‌లో కూడా చేరాయి. ఇప్పుడు ఈమె

ర‌వితేజ కాద‌ట‌.. నితిన్ 

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన చిత్రాల్లో 'ఎఫ్ 2' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ఎఫ్ 3' రూపొందుతుంద‌ని చెప్పారు.

జనసేన నుంచి పోటీచేసే అభ్యర్థులకు డెడ్‌‌లైన్

2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసే అభ్యర్థులకు అధిష్టానం డెడ్‌లైన్ విధించింది. ఆశావహుల నుంచి వస్తున్న బయోడేటాల స్వీకరణకు తుది గడువుగా ఈ నెల 25వ తేదీని

అభిమానులతో మాట్లాడి పార్టీ మారుతా: చింతమనేని

దెందలూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల యావత్ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, విద్యా్ర్థి విభాగాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.

చంద్రబాబును ఓడించాలని స్వామిజీ షాకింగ్ నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల యుద్ధాలు, జోస్యాలు, శాపనార్థాలు ఎక్కువయ్యాయి.