‘సైరా’ గురించి షాకింగ్ న్యూస్..!

  • IndiaGlitz, [Saturday,September 07 2019]

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్.. కెరియర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తండ్రి కలను నెరవేర్చడంలో భాగంగా చిరు తనయుడు రామ్ చరణ్ ఈ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలుకుని ప్రొడక్షన్ వర్క్స్ అయిపోవడమే కాకుండా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇక థియేటర్లలోకి రావడమే ఆలస్యం. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్‌ని పూర్తిస్థాయిలో చిత్రబృందం మొదలుపెట్టేసింది. అంతేకాదు సైరా నర్సింహారెడ్డి పురిటిగడ్డ అయిన కర్నూలు జిల్లాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే .. సరిగ్గా ఇదే సమయంలో ‘సైరా’ చిత్రబృందం నుంచి ఓ షాకింగ్ న్యూస్ వెలుగుచూసింది. వాస్తవానికి సైరా సినిమాను అక్టోబర్-02న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి సినిమాను 02నుంచి 08కి వాయిదా వేసి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం.. ఇంకా గ్రాఫిక్స్ పనులు కొలిక్కి రాకపోవడమేనట. అప్పటి వరకూ ప్రమోషన్స్‌ గట్టిగా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ విషయం తెలసిన మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారట. ఇప్పటికే ఏడాదికిపైగా సినిమా కోసం వేచి చూసిన అభిమానులు.. మళ్లీ రిలీజ్ వాయిదా పడుతుండటంతో అసంతృప్తికి లోనవుతున్నారట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే దర్శకనిర్మాతలు స్పందించాల్సి ఉంది.