Yasaswi Kondepudi:అతనో చీటర్.. ఓట్ల కోసం అబద్ధాలు, యశస్వి కొండెపూడిపై ఎన్జీవో సంస్థ ఆరోపణలు

  • IndiaGlitz, [Thursday,February 09 2023]

యశస్వి కొండెపూడి.. ఈ పేరు అందరికీ తెలిసిందే. ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ప్రసారమైన ‘‘సరిగమప సింగింగ్ షో’’ టైటిల్ విన్నర్‌ అయిన యశస్వీకి ఊహించని స్టార్ డమ్ వచ్చింది. సమంత, శర్వానంద్ నటించిన జానులోని ‘‘లైఫ్ ఆఫ్ రామ్’’ పాటను అద్భుతంగా పాడి రాత్రికి రాత్రి స్టార్‌గా మారాడు. ఇతనికి ఎంతో మంది సంగీత ప్రియులు వీరాభిమానులుగా మారారు. అయితే ఇటీవల యశస్వి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పబ్లిసిటీ కోసం చీటింగ్‌కు పాల్పడినట్లుగా ‘‘నవసేవ ఫౌండేషన్’ నిర్వాహకురాలు ఫరా కౌసర్ ఆరోపించారు.

50 మందిని చదివిస్తున్నానన్న యశస్వి:

కొద్దిరోజుల క్రితం ఓ షోలో పాల్గొన్న యశస్వి మాట్లాడుతూ.. తాను నవసేవ పేరుతో ఓ ఎన్జీవో సంస్థను నడుపుతున్నానని, దాని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నానని చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలను ఫరా ఖండించారు. యశస్వి చెప్పినదానిలో నిజం లేదని.. ఆ ఎన్జీవోకు అతనికి ఎలాంటి సంబంధం లేదని, దానిని తానే నడుపుతున్నట్లు వెల్లడించింది. సింగింగ్ షోలో జనాన్ని ఆకట్టుకోవడానికి, ఓట్లు సంపాదించుకోవడానికి నవసేను తానే నడిపిస్తున్నట్లు యశస్వి అబద్ధాలు చెప్పాడని ఫరా స్పష్టం చేశారు. దీనిపై తాను అతనిని నిలదీశానని.. క్షమాపణలు చెప్పాలని కోరానని ఆమె పేర్కొంది.

ఆ ఎన్జీవో యశస్విది కాదు:

తాను మాటలను అతను పట్టించుకోలేదని.. సేవ చేస్తున్నట్లు అబద్ధాలాడి పాపులర్ అవ్వాలని ప్రయత్నించాడని ఫరా ఆరోపించింది. దీనిపై త్వరలోనే యశస్వి, టీవీ ఛానెల్, యాంకర్‌పైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఫరా కౌసర్ స్పష్టం చేసింది. మరి దీనిపై యశస్వి ఎలా స్పందిస్తాడో చూడాలి. అయితే అతని అభిమానులు, సంగీత ప్రియులు మాత్రం ఫరా మాటలతో ఉలిక్కిపడ్డారు. అయితే నిజానిజాలు త్వరలోనే తెలియాలని వారు కోరుకుంటున్నారు.

More News

Avika Gor:అందరికీ... పాప్‌కార్న్‌లో ప్రతి సీనూ నచ్చుతుంది: అవికా గోర్‌

అవికా గోర్‌ మనకు చిన్నారి పెళ్లికూతురుగా తెలుసు. ఉయ్యాలజంపాలా హీరోయిన్‌గానూ తెలుసు.

SriDevi : పుస్తకంగా శ్రీదేవి జీవిత చరిత్ర.. ఇక రావాల్సింది బయోపిక్కే

శ్రీదేవి.. ఈ పుట్టినరోజు పేరు తెలియనివారు భారతదేశంలో లేరు. అందాల నటిగా భారతీయ చిత్ర పరిశ్రమపై ఆమె వేసిన ముద్ర అసాధారణం.

Pawan Kalyan:దుర్గమ్మకు పవన్ సమర్పించిన 'చీర' .. మాకంటే మాకు, పై స్థాయిలో అధికారులపై ఒత్తిడి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మ భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న సంగతి తెలిసిందే.

Popcorn:‘పాప్ కార్న్’ సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 10న రిలీజ్

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో

Kiara Advani:కియారా అద్వానీకి క్షమాపణలు చెప్పిన ఉపాసన కామినేని.. కారణమేంటీ..?

బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీలకు టాలీవుడ్ యువ కథనాయకుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన క్షమాపణలు చెప్పారు.