అఖిల్ మీద అంత వ‌ర్కవుట్ అవుతుందా!!

  • IndiaGlitz, [Wednesday,August 19 2020]

అఖిల్ అక్కినేని మంచి హిట్ కోసం చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ కూడా అఖిల్ స‌క్సెస్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో వైపు సురేంద‌ర్ రెడ్డి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామ్ తాళ్లూరి కాంబినేష‌న్‌లోనూ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేయ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌టంతో ఈ గ్యాప్‌లో అఖిల్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడ‌ట సురేంద‌ర్ రెడ్డి.

అఖిల్‌, సురేంద‌ర్ రెడ్డి మూవీని జాగ‌ర్ల‌మూడి క్రిష్‌, రాజీవ్ రెడ్డి నిర్మించాల‌ని అనుకున్నారు. చ‌ర్చ కూడా జ‌రిగాయట‌. అయితే సినిమాకు సురేంద‌ర్ దాదాపు రూ.45 కోట్ల బ‌డ్జెట్ కోట్ చేయ‌డంతో నిర్మాత‌లు షాక‌య్యార‌ట‌. ఇంత భారీ బ‌డ్జెట్ మూవీ అఖిల్‌పై వ‌ర్క‌వుట్ అవుతుందా? అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. దీంతో నిర్మాత‌లు డైల‌మాలో ప‌డ్డారు. ఎందుకంటే అఖిల్‌కు ఇంత వ‌ర‌కు హిట్టే లేదు. ఇలాంటి సమ‌యంలో ఇంత బ‌డ్జెట్ పెడితే క‌ష్ట‌మ‌ని వారు భావిస్తున్నార‌ని టాక్‌.