close
Choose your channels

సీక్రెట్‌గా పోర్న్ చూసేవారికి షాకింగ్ న్యూస్!

Friday, July 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీక్రెట్‌గా పోర్న్ చూసేవారికి షాకింగ్ న్యూస్!

పోర్న్ అంటే పడి చచ్చే వాళ్లు ఆ వీడియోలను చూడకుండా ఉండలేరు. మూడోకంటికి తెలియకుండా ఉండాలని ఇన్‌కాగ్నిట్ మోడ్ బ్రౌజర్‌లో అశ్లీల వెబ్‌సైట్లు ఓపెన్ చేసి మరీ చూస్తుంటారు. అయితే ఈ మోడ్‌లో చూస్తే ఎవరికీ తెలియదు.. ఎవరూ పసిగట్టలేరని అనేది వారి భ్రమ. అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయిందడోయ్. మీరు ఏ మోడ్ బ్రౌజర్‌లో చూసినా సరే ఆ వెబ్‌సైట్లను ఇట్టే పట్టేయచ్చట. గూగుల్, ఫేస్‌బుక్ సహా పలు కంపెనీలు ఇలా అశ్లీల వెబ్‌సైట్లు చూసే వారి డేటాను పట్టేస్తున్నాయట.

ప్రైవేట్ బ్రౌజర్‌లో వెబ్‌సైట్లు ఇలా పసిగడుతున్నాయని మైక్రోసాఫ్ట్‌, కార్నిగీ మెలన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా చేపట్టిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. కాగా.. పరిశోధకులు విశ్లేషించిన 22,484 అశ్లీల సైట్లలో 93 శాతం సైట్లు థర్డ్‌ పార్టీ యాప్స్‌కు డేటాను లీక్‌ చేసినట్టు తేలింది. అశ్లీల సైట్స్‌లో 93 శాతం పేజీలు యూజర్‌ డేటాను థర్డ్‌ పార్టీకి చేరవేస్తున్నాయని, 79 శాతం థర్డ్‌ పార్టీ కుకీస్‌ను కలిగి ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది. అశ్లీల సైట్లలో కేవలం 17 శాతం సైట్లు మాత్రమే సమాచార భద్రతను కలిగి ఉన్నాయని తేలింది. మొత్తానికి చూస్తే పోర్న్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.